వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరిగా ఉన్నానని ఫోన్ చేసింది..!ఊపుకుంటూ వెళ్లాడు..!మరో నలుగురితో కలిసి ఊడ్చిపారేసింది..!!

|
Google Oneindia TeluguNews

దుబాయ్/హైదరాబాద్ : మోసం చేయాలనుకున్నప్పుడు మతం, ప్రాంతం, భషతో ఎలాంటి పని ఉండదు. కేవలం ఎదుటి వాడి దగ్గర డబ్బు కట్టలు ఉన్నాయా..? వాటిని ఎలా సొంతం చేసుకోవాలి..? అందుకోసం అతన్ని ఎలా బురిడీ కొట్టించాలి..? అనే అంశాలపైనే కేటుగాళ్లు రీసెర్చ్ చేస్తుంటారు. అచ్చం ఇలాంటి సంఘటననే ఓ అందమైన మహిళ కాస్త విభిన్నంగా అమలు చేసి, ఆ యువకుణ్ని అడ్డంగా మోసం చేసి అతని దగ్గర ఉన్నదంతా దోచేసుకుంది.

అక్కడ సీన్ రివర్స్ .. పిల్లలే టీచర్లకు మార్కులు .. మార్కులు తగ్గితే ఆ బెనిఫిట్స్ లేనట్టేఅక్కడ సీన్ రివర్స్ .. పిల్లలే టీచర్లకు మార్కులు .. మార్కులు తగ్గితే ఆ బెనిఫిట్స్ లేనట్టే

మోసపోయిన సదరు యువ వ్యాపార వేత్త పోలీసులకు పిర్యదు చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఓ అందమైన మహిళ వెనక ఉన్న నీచమైన గుణానికి నిదర్శనమే ఈ సంఘటన. ఒంటరిగా ఉన్న చెప్పి ఓ యువకున్ని తన ఫ్లాట్‌కు పిలిచిన ఓ మహిళ..మరో నలుగురితో కలిసి అతని దగ్గర ఉన్న డబ్బంతా దోచుకున్న ఘటన దుబాయిలో జరిగింది. ఇరాక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త బిజినెస్ పని నిమిత్తం గత నెలలో విజిట్ వీసాపై షార్జా వెళ్లాడు. అతడికి ఆన్‌లైన్‌లో ఓ మహిళ పరిచయమైంది. ఆమె తనను తాను స్వీడిష్ విద్యార్థినిగా పరిచయం చేసుకుంది. పరిచయం పెరగడంతో అతడిని పర్సనల్ గా కలవాలని ఆ కిలాడీ లేడి వయ్యారాలు వలకబోస్తూ చెప్పింది.

A Lady trapped a buisiness man and cheated 11 lacks..!!

ఈ క్రమంలో ఏప్రిల్ 17న వ్యాపారవేత్త దుబాయి వెళ్లాడు. తనకు ఇరాక్ నుంచి వచ్చిన 30లక్షల 26వేల రూపాలను తీసుకొని తిరిగి షార్జా వెళ్తున్న అతడికి సదరు మహిళ ఫోన్ చేసి అల్ కోజ్‌లోని తన ఫ్లాట్‌కు ఆహ్వానించింది. ఫ్లాట్‌లో తాను ఒంటరిగానే ఉన్నానని వస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చని చెప్పింది. ఆమె ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన అతడికి ఊహించని షాక్ తగిలింది.

ఫ్లాట్‌లో ఆమెతో పాటు మరో నలుగురు మహిళలు ఉన్నారు. ఫ్లాట్‌కు వెళ్లగానే ఆ ఐదుగురు ఆఫ్రికన్ మహిళలు అతడ్ని ఒక గదిలో బంధించారు. అనంతరం అతడి వద్ద నుంచి 11లక్షల 24వేలు రూపాయలను లాక్కున్నారు. తన వద్ద ఉన్న మిగిలిన డబ్బు కూడా లాగేసుకుంటారని భావించిన వ్యాపారవేత్త వారు సోదాలు చేస్తుండానే తనకు శ్యాస సమస్య ఉందని విడిచిపెట్టాలని వేడుకోవడంతో వదిలిపెట్టారు. అనంతరం తన వద్ద డబ్బు లేదని కనీసం క్యాబ్ కోసమైన కొంత నగదు ఇవ్వాలని వారిని అడిగాడు.

దాంతో ఒక మహిళ అతడికి 600 దిర్హామ్స్ ఇచ్చింది. అవి తీసుకొని అక్కడి నుంచి బయటపడిన అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే వరకు భవనం బయట వేచి చూశాడు. పోలీసులు రాగానే యువతి ప్లాట్‌కు తీసుకెళ్లాడు. అయితే పోలీసులు వచ్చేలోపు ఇద్దరు మహిళలు అక్కడి నుంచి జంప్ అయ్యారు. దాంతో పోలీసులు మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. కాని పోగొటట్టుకున్న సొమ్ములు చేతికందక విచారాన్ని వ్యక్తం చేసాడు సదరు వ్యాపారి.

English summary
A woman who has been stranded and has called a young man to his flat The incident in Dubai, where he had stolen all the money with another four. A businessman from Iraq went to Sharjah on Vizio Visa in April this year for business work. He was introduced to a woman online. She introduced herself as a Swedish student. With the increase in familiarity, the Khiladi was right to meet him as a personal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X