వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచిత్రం: గొర్రెల మందకు కాపలాగ సింహం(వీడియో)

|
Google Oneindia TeluguNews

మాస్కో: సింహం అంటే ఏ జంతువుకైనా హడలే. ఎందుకంటే అది అడవికి రారాజు. బలశాలి అయిన సింహం ముందు ఏ జంతువైనా మొకరిల్లాల్సిందే. రష్యాలోని ఓ ప్రాంతంలో మాత్రం ఓ సింహం.. గొర్రెల మందకు కాపాల కాస్తోంది. గొర్రెలకు ఎలాంటి ఆపదా రాకుండా ఆ మంద చుట్టూ తిరుగుతూ రక్షణ కవచంలా ఉంటోంది.

ఈ వింత వివరాల్లోకి వెళితే.. రష్యాలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ డగెస్థాన్‌కి చెందిన బెరంబెక్‌ రహిమొవ్‌కు కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని రోజూ మేత కోసం అడవికి తీసుకెళతాడు. వాటితో పాటు.. ఓ సింహం కూడా అతని వెంట వెళుతుంది.

సాధారణంగా గొర్రెలు కనిపిస్తేనే వాటిపై దాడి చేసే సింహం.. అతగాడి గొర్రెలకు నిరంతరం కాపలా ఉంటోంది. గొర్రెలవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా రక్షణ కల్పిస్తోంది.

సింహం గురించిన అసలు విషయానికొస్తే.. బెరంబెక్‌‌కు అతని స్నేహితుడు ఈ సింహం ఆరు నెలల పసికూనగా ఉన్నప్పుడు బహుమతిగా ఇచ్చాడట. దీంతో సింహానికి 'మాష' అని పేరు పెట్టి తనకున్న గొర్రెల మందలో కలిపేసి పెంచడం ప్రారంభించాడు. దీంతో అది కూడా తాను సింహం అని, అడవికి రారాజు అనే సంగతి తెలియకుండా పెరిగింది.

ఈ విధంగా 'మాష' గొర్రెలతోనే పెరిగి పెద్దదైంది. గొర్రెలతో పెరిగినా సింహం సింహమే కదా. అందుకే 'మాష' పెద్దదయ్యాక అదే గొర్రెల మందను రక్షించే బాధ్యతను అప్పగించాడు బెరంబెక్. దీంతో సింహాన్ని దాటి పారిపోయే పరిస్థితి గొర్రెలకు లేకుండా పోయింది. అంతేగాక, ఆ గొర్రెల మంద వైపు ఏ జంతువైనా, ఏ దొంగైనా చూసే ధైర్యం కూడా లేకుండా పోయింది.

English summary
Masha isn't your regular lioness, she's a cool lioness. She enjoys things like extremely cold weather, taking long walks around the farm and babysitting sheep from dangerous predators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X