వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫ్లోరిడా స్కూల్ కాల్పుల ఘటన తర్వాత అమెరికాలోని చాలామంది చిన్నారులు.. ఎక్కడ తమ స్కూల్లో కాల్పులు చోటు చేసుకుంటాయో? అన్న భయాందోళనతో గడుపుతున్నారట. ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

13 నుంచి 17ఏళ్ల వయసున్న విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సర్వేలో 57 శాతం చిన్నారులు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు. అమెరికాలో మైనారిటీలైన హిస్పానిక్‌(లాటినోలు), నల్లజాతి పిల్లలు కాల్పుల ఘటనలపై అందరికంటే ఎక్కువగా భయపడుతున్నట్టు సర్వే తెలిపింది.

US
కాల్పుల ఘటనలను అరికట్టాలంటే గన్ కల్చర్ ను అరికట్టాలని విద్యార్థులు చెబుతున్నారు. స్కూళ్లలో మెటల్ డిక్టేటర్స్ ఏర్పాటు చేయాలని, తద్వారా ఎవరు మారణాయుధాలు తీసుకొచ్చినా.. గుర్తించే వీలు ఉంటుందని అంటున్నారు. ఒకేసారి ఎక్కువ మందిని చంపడానికి వాడే తుపాకులపై నిషేధం వల్ల కూడా కాల్పుల ఘటనలను అరికట్టవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.

కాగా, ఫిబ్రవరి 14న పార్క్‌లాండ్‌లోని మార్జరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌ కాల్పుల ఘటనలో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత తుపాకుల వాడకంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

English summary
In the aftermath of the deadly shooting at a high school in Parkland, Florida, a majority of American teens say they are very or somewhat worried about the possibility of a shooting happening at their school – and most parents of teens share that concern, according to new Pew Research Center surveys of teens ages 13 to 17 and parents with children in the same age range.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X