వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ.కొరియా ఆయుధ వ్యాపారం: ఈజిప్ట్‌లో ఓ బయ్యర్‌కు అమ్మకం, అమెరికా భగ్గు

ఉత్తర కొరియా భారీగా ఆయుధాల స్మగ్లింగ్ చేస్తోందని ఆమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్ యాంగ్: ఉత్తర కొరియా భారీగా ఆయుధాల స్మగ్లింగ్ చేస్తోందని ఆమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది.

అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో చైనా ఎక్స్‌ప్రెస్ వే, ఎందుకంటేఅరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో చైనా ఎక్స్‌ప్రెస్ వే, ఎందుకంటే

ఈ ఆయుధ స్మగ్లింగ్ కారణంగా ఈజిప్ట్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. 2016 ఆగస్ట్‌లో ఈజిప్ట్ అధికారులు ఉత్తర కొరియా నౌకను సీజ్ చేశారు.

నౌకను సీజ్ చేశారు

నౌకను సీజ్ చేశారు

2016 ఆగస్టులో ఈజిప్ట్‌ అధికారులు సూయజ్‌ కెనాల్‌లో దాడి చేసి ఉత్తర కొరియాకు చెందిన జైషున్‌ అనే నౌకను సీజ్‌ చేశారు. దీనిలో దాదాపు 30,000 రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడ్లను కనుగొన్నారు. కంబోడియా పతాక రంగులో ఉన్న ఈ నౌకకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరించి ఈజిప్ట్‌కు అందించారు. దీంతో వారు తప్పని పరిస్థితుల్లో ఐక్య రాజ్య సమితి ఆంక్షలు అమలు చేసేందుకు దాడి నిర్వహించారు.

గుర్తు తెలియని వ్యాపారికి సరఫరా

గుర్తు తెలియని వ్యాపారికి సరఫరా

అయితే ఈ నౌకలోని ఆయుధాలను ఎక్కడికి చేరవేస్తున్నారో అధికారులు కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ.. ఈజిప్ట్‌లోని గుర్తు తెలియని వ్యాపారికి వీటిని సరఫరా చేస్తున్నట్లు మాత్రం తేల్చారు. సదరు వ్యాపారి నుంచి ఈజిప్ట్‌ సైన్యానికి వీటిని విక్రయించే అవకాశముందని భావించారు.

ఈజిప్ట్ పైన అమెరికా భగ్గు

ఈజిప్ట్ పైన అమెరికా భగ్గు

ఉత్తర కొరియాతో పరోక్షంగా ఆయుధ వ్యాపారం చేస్తోందని ఈజిప్ట్‌పై అమెరికా భగ్గుమంది. ఈ మేరకు హెచ్చరించింది. ఉత్తర కొరియా, అమెరికా రెండింటిల్లో ఏదో ఓ పక్షానే ఉండాలని చెప్పింది. అయితే ఐక్య రాజ్య సమితి ఆంక్షలకు అనుకూలంగా ఉత్తర కొరియాతో మేం వ్యవహరిస్తామని, ఆ దేశంతో ఎలాంటి ఆయుధ వ్యాపారం చేయమని ఈజిప్ట్ చెప్పింది.

 ఈజిప్ట్‌కు సాయం ఆపేశారు

ఈజిప్ట్‌కు సాయం ఆపేశారు

ఈజిప్ట్‌కు అమెరికా సైన్యం అందించే 300 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ఆ తర్వాత ఆపేశారు. ఈజిప్ట్‌లో మానవహక్కుల ఉల్లంఘన పెరగటంతోనే ఈ సాయాన్ని నిలిపివేసినట్లు ట్రంప్‌ తెలిపారు.

 అమెరికా వ్యతిరేక దేశాలతో వ్యాపారం

అమెరికా వ్యతిరేక దేశాలతో వ్యాపారం

కాంగో, క్యూబా, సిరియా, మయన్మార్‌, ఇరాన్‌, ఉగాండా దేశాలతో ఉత్తర కొరియా ఆయుధ వ్యాపారం చేస్తోంది. వీటిల్లో చాలా దేశాలు అమెరికాను వ్యతిరేకిస్తాయి. తాజాగా అమెరికా మిత్రదేశమైన ఈజిప్ట్‌ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. అగ్ర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా కారుచౌకగా ఆయుధాలను విక్రయిస్తుంది.

English summary
A North Korean ship was seized off Egypt with a huge cache of weapons destined for a surprising buyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X