• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీరు బాతాఖానీ: రోజుకో చిన్న బీరుతో శృంగారంలో టాపులేపుతారట !

|

మద్యంపై ఎన్నో సర్వేలు మరెన్నో విషయాలు తెలియజేశాయి. అధికంగా మద్యం సేవిస్తే శరీర అవయవాలు దెబ్బతింటాయని కొన్ని సర్వేలు తెలుపగా.. మనిషి సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయని మరికొన్ని సర్వేలు సెలవిచ్చాయి. కానీ తాజా సర్వే చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే...! రోజు ఓ పింట్ బీర్ అంటే చిన్న బీర్ తాగితే దానివల్ల కలిగే ఉపయోగాలు ఈ కొత్త సర్వే వెల్లడించింది. ఈ బీర్ తాగితే కైపెక్కడం విషయం అలా ఉంచితే... పడకలో మాత్రం శృంగారసమయంలో దుమ్ము లేపుతారట.

మందు కొట్టి 30లక్షల మంది చనిపోయారట

ఇక అసలు విషయానికొస్తే... రోజుకో చిన్న బీర్ తాగితే ఆ వ్యక్తి యొక్క సెక్స్ సామర్థ్యం మెరుగవుతుందని కొత్త పరిశోధనల ద్వారా వెల్లడైంది. ఒక వ్యక్తి తక్కువ మోతాదులో బీర్ కొడితే శృంగారంలో కింగ్ అవుతాడని వెల్లడించింది. అయితే రోజుకు ఒక్క చిన్న బీర్ కంటే ఎక్కువగా తాగితే అది వ్యర్థమే అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోజుకు రెండు యూనిట్ల ఆల్కహాల్ తీసుకుంటే అంటే అందాజుగా ఒక చిన్న బీర్ లేదా ఒక గ్లాస్ వైన్ తీసుకుంటే ఇంపోటెన్సీ అవకాశాలు తక్కువగా ఉంటాయని... మద్యం సేవించని వారితో పోలిస్తే అది 34 శాతం తక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

A pin of beer a day, helps boost mens performance in bed

అంతకుముందు జరిపిన పరిశోధనల్లో మద్యం ఎక్కువగా సేవించిన వారిలో అంగస్తంభన సమస్యలు అధికంగా ఉన్నట్లు వారు గమనించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఓ మాదిరిగా మద్యం సేవించే వారిలో అంగస్తంభన సమస్యలు కాస్త తక్కువగానే ఉన్నట్లు వీరు తెలిపారు.

చైనాకు చెందిన సిచువాన్ యూనివర్శిటీ పరిశోధకులు 24 వేర్వేరు కేసులను స్టడీ చేశారు. దాదాపు 1,55,000 పేషెంట్లపై పరిశోధనలు చేశారు. వీరిలో ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నట్లు వీరు గుర్తించారు. అందులో 40 ఏళ్ల పైబడిన వారిలో అంగస్తంభన సమస్య ఎక్కువగా ఉన్నట్లు వీరు గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ పరిశోధనలపై బ్రిటీష్ సొసైటీ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ జెఫ్ హాకెట్ మరో వాదన వినిపించారు. మహిళలు కొద్దిపాటి మద్యం సేవించడం వల్ల శృంగార సమయంలో మహిళల పెర్ఫామెన్స్ ఆశించిన స్థాయిలో ఉండదని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new study now claims that drinking pint of beer daily boosts a man’s performance in bed.The study says that men who have a small regular drink are less likely to be a flop than drunkards.However, drinking more than a pint a day did not increase the benefits, scientists found.They discovered two units of alcohol a day — roughly a pint of beer or a small glass of wine — cut the risk of impotence by 34 per cent compared with non-drinkers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more