వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలపాగా ఉందని సిక్కు నటుడ్ని ప్లేన్ ఎక్కనివ్వలేదు

|
Google Oneindia TeluguNews

మెక్సికో: తలపాగా పెట్టుకున్నందుకు ఓ అమెరికన్(భారత సంతతి) సిక్కు యువకుడిని విమానం ఎక్కనీయలేదు అధికారులు. ఈ ఘటన మెక్సికో విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వారిస్‌ అహ్లువాలియా అనే డిజైనర్‌, నటుడు మెక్సికో నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సి ఉంది.

ఏరో మెక్సికో విమానం ఎక్కుతున్న సమయంలో అతన్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తలపాగా ఉందని, అది తీసి విమానం ఎక్కాలని సూచించారు. అయితే, సిక్కులు బహిరంగంగా తలపాగా తొలగించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

A Sikh designer barred from boarding plane due to turban

ఈ నేపథ్యంలో వారిస్‌ తలపాగా తీయడానికి నిరాకరించారు. దీంతో అధికారులు అతన్ని విమానం ఎక్కకుండా నిలిపివేశారు. ఈ విషయాన్ని వారిస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌ చేశారు.

ఈ ఘటనపై అమెరికాలోని సిక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది సిగ్గుపడాల్సిన చర్య అంటూ విమర్శించింది. సిక్కు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జగరకుండా చూసుకోవాలని సూచించింది.

English summary
A Sikh American actor and designer has been barred from boarding a flight from Mexico City to New York after he refused to remove his turban during a security check.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X