వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులోనే గన్నుతో కాల్చుకున్న జడ్జి...!

|
Google Oneindia TeluguNews

అనేక సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ఓ న్యాయమూర్తి కోర్టు అవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదికూడ కోర్టులో తీర్పు చెప్పిన తర్వాత తనను తాను కాల్చుకున్నారు. అంతకు ముందే ఓ కేసులో వాదనలు విన్న సదరు జడ్జి ఆరుగురు ముద్దాయిలను నిర్ధోషులుగా ప్రకటించారు. తీర్పు సమయంలో ఉద్వేగానికి లోనైన జడ్జీ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఫేస్‌బుక్ లైవ్ ద్వార తెలిపారు. తుపాకితో కాల్చుకున్న జడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.

యాలా కోర్టులో పని చేస్తున్న కనాకోర్న్ పియాంచన అనే జడ్జీ ముద్దాయిలను నిర్థోషులుగా ప్రకటించిన తర్వాత తన జేబులో ఉన్న తుపాకిని తీసీ కాల్చుకున్నారు. అంతకు ముందు ఒకరిని శిక్షించాలంటే అందుకు తగిన అధారాలు పక్కాగా ఉండాలి. ఒకవేళ లేకపోతే వారిని శిక్షించకూడదు అన్నారు. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత, విశ్వాసం ఉండాలి అంటూ తీర్పుకు ముందు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉద్రేకపూరితంగా మాట్లాడారు.

A Thai judge shot himself in the chest in a court

దీంతో పాటు థాయ్‌లాండ్ కోర్టులో ధనవంతులకే అనుకూలంగా ఉంటాయని ,సామాన్య ప్రజల విషయంలో కఠినాత్మకంగా ఉంటాయని అనే విమర్శలు వస్తున్నాయని , వీటీని భరించలేకనే జడ్జీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానిక మీడీయాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆయనకు వ్యక్తిగత కారణాల ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారనే అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జడ్డి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు వెల్లడించారు.

English summary
A Thai judge shot himself in the chest in a court in an apparent suicide attempt following complaints about interference in a case he was presiding over
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X