వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ చూస్తూ రైలు పట్టాలపై పడిన యువతి.. అప్పుడే వచ్చిన రైలు..(వీడియో)

|
Google Oneindia TeluguNews

మ్యాడ్రిడ్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. అదే వారికి ప్రపంచమైపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. వాటిని విపరీతంగా ఉపయోగించడం, వాటికి బానిస కావడం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అంతేగాక, పలువురు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది.

తాజాగా, స్పెయిన్‌లో ఓ యువతి స్మార్ట్‌ఫోన్ చూస్తూ తన ప్రాణాలమీదకు తెచ్చుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర మ్యాడ్రిడ్ ఎస్ట్రేచ్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికురాలు రైలు కోసం వేచి చూస్తోంది. అప్పటికే ఆమె తన స్మార్ట్‌ఫోన్ చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోయింది.

 A Woman distracted by mobile phone falls in front of oncoming train

రైలు ఫ్లాట్‌ఫాంపైకి రావడం గమనించిన ఆ యువతి.. తన మొబైల్ ఫోన్ చూస్తూనే కూర్చున్న చోటు నుంచి లేచి రైలు ఎక్కేందుకు పట్టాల దగ్గరకు వెళ్లింది. అయితే, ఆమె కిందకు గానీ.. ఫ్లాట్‌ఫాంను గానీ చూడకుండా తన స్మార్ట్‌పోన్‌ను చూసుకుంటూ ముందుకు కదిలింది.

అలా ముందకు వెళ్లిన యువతి.. రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయింది. కాగా, సదరు ప్రయాణికురాలు పట్టాలపై పడటం వరకు మాత్రమే వీడియో రికార్డ్ అవడంతో రైలు సమయానికి ఆగిందా? లేక? ప్రయాణికురాలికి ఏమైంది? అనే విషయం ఉత్కంఠగా మారింది.

కాగా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన మెట్రో ది మ్యాడ్రిడ్ స్టేషన్ అధికారులు.. సదరు ప్రయాణికురాలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. అంటే ఆ రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపివేసి ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆ ప్రయాణికురాలు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

స్మార్ట్ ఫోన్లు అవసరానికి మంచి ఇలా రైల్వే స్టేషన్లు, రహదారులు దాటే సమయాల్లో ఉపయోగించడం ప్రమాదకరమనే చెప్పాలి. అందుకే స్మార్ట్ పోన్లతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇలాంటి ప్రమాదాలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్న విషయం తెలిసిందే. సెల్ఫీ కారణంగానూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. అలాంటి ప్రయత్నాలు ఆగకపోవడం విచారకరనం.

English summary
Spanish rail authorities have released a video of a woman who fell onto the tracks as a train approached as she was distracted by her mobile phone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X