వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత విధ్వేషమా?: వినాయక విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

బహ్రెయిన్: గణపతి ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మనదేశంలోనేగాక ప్రపంచ దేశాల్లో అనేక వినాయక విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. వీటిని అనేక దుకాణాల్లో అమ్మకానికి పెట్టారు. అయితే, ఓ దుకాణంలో పెట్టిన వినాయక విగ్రహాలను ఇద్దరు ముస్లిం మహిళ నేలకేసి కొట్టి పగలగొట్టింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Bahrain Women breaking ganesh idol in capital manama | Oneindia Telugu

వినాయక విగ్రహాల ధ్వంసం

అయితే, ఈ ఘటన జరిగింది మనదేశంలో కాదు.. బహ్రెయిన్‌ రాజధాని మనామాలో చోటు చేసుకుంది. ఓ దుకాణంలో వినాయక విగ్రహాలను చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎందుకుపెట్టారంటూ ఆ విగ్రహాలను ఒక్కటొక్కటిగా నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. షాపు సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె ఆపకుండా విగ్రహాలను ధ్వంసం చేశారు.

ఇంత విధ్వేషమా?

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంత విద్వేషం ఎందుకు? అంటూ భారతీయులతోపాటు ప్రపంచంలోని ఇతర నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఆ మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మహిళలను కఠినంగా శిక్షించాలంటూ..

ఏ మతం కూడా మరో మతాన్ని ద్వేషించమని చెప్పదని, విద్వేషం రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఆ ఇద్దరు మహిళలను కఠినంగా శిక్షించాలని, ఆ వివరాలను బహ్రెయిన్ ప్రభుత్వం తెలపాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం కూడా స్పందించింది.

పోలీసుల అదుపులో నిందిత మహిళ..

విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన 54ఏళ్ల సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు, ఈ ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నట్లు బహ్రెయిన్ మంత్రి ఒకరు వెల్లడించారు. అయితే, ఆ మహిళలపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వలాలు ఆగడం లేదు. ఇదే నా మీ పరమత సహనం అంటూ మండిపడుతున్నారు.

English summary
Video of Woman in Bahrain Store Smashing Ganesha Murti Goes Viral, Gets Prosecuted for Hate Crime After Netizens Fume
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X