వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇంట్లో ఆమెను అలా చూసి..: జీవితంలో ఇలాంటిది చూడలేదన్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

జార్జియా: వ్యాధి కారణంగా మంచానికే పరిమితమైన ఓ మహిళను.. కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆమె శరీరం సగం వరకు కుళ్లిపోయింది. అత్యంత దయనీయ స్థితిలో, చూడటానికి భయంగొల్పే స్థితిలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పోలీసులు రక్షించారు. ఆ మహిళను ట్రాసీ సారెల్స్‌ (50)గా గుర్తించారు.

ఉత్తర జార్జియాలోని ఓ ఇంట్లో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు.. సారెల్స్ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆమె కాళ్లకు పురుగులు పట్టి సగం వరకు కుళ్లిపోయినట్టు గుర్తించారు. ఆమె శరీరమంతా బొద్దింకలు, ఈగల గుడ్లతో నిండిపోయినట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు.

A woman was found half-decomposed, crawling with maggots — and still alive, police say

వ్యాధి కారణంగా విపరీతంగా లావెక్కిన ఆమె.. కదల్లేని స్థితికి చేరుకున్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆమె ముఖంపై ప్లాస్టిక్ పేపర్స్, చెత్తా చెదారమంతా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఆ ఇంట్లో కంప్యూటర్ గది తప్ప మిగతా ఇళ్లంతా తీవ్ర దుర్గంధంతో అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. తమ జీవితంలో ఇలాంటి కేసును చూడలేదని పోలీసులు వెల్లడించారంటే.. ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కాగా, టెర్రి సారెల్స్‌ (54)కు భర్తతో పాటు, క్రిస్టియాన్(18) అనే కుమారుడు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై వారిని విచారించగా.. ఆర్థిక కష్టాలతోనే ఈ సమస్య తలెత్తినట్టు వెల్లడించారు. తమ వద్ద అసలు డబ్బు లేదని, దానికి తోడు ఉద్యోగం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు. చికిత్స అందించడానికి డబ్బులు లేకనే ఆమెను అలా వదిలేసినట్టు చెప్పారు.

English summary
A bedridden woman was found living in squalor in her home in northern Georgia, partly decomposing and covered in cockroaches and maggots, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X