వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే-ఇండియా వీక్ 2018: 'డిజిటల్ ట్యాక్స్ సిస్టంకు ఆధార్, జీఎస్టీ మంచి పునాది వేశాయి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: 5వ యూకే-ఇండియా లీడర్‌షిప్ వార్షికోత్సవ కాన్‌క్లేవ్ కోసం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ శర్మ లండన్ వచ్చారు. ఆధార్, యూఐపీ, జీఎస్టీలు డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్‌కు దేశంలో గట్టి పునాదిని వేశాయని చెప్పారు. భారత్ పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

యూకే -ఇండియా స్ట్రాటెజిక్ రిలేషన్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం జరుగుతోంది. ఇది జూన్ 18వ తేదీన ప్రారంభమైంది. జూన్ 22న ముగుస్తుంది.

 Aadhaar, GST will create solid foundation for digital tax system

ఈ సమావేశం కోసం వచ్చిన మోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్ సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐ, ఆటోమేషన్ వంటి వాటికి భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.'ఆధార్, యూఐపీ, జీఎస్టీలు భారత్‌లో డిజిటల్ ట్యాక్స్ సిస్టమ్‌కు మంచి పునాది వేశాయి' అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఇండియా ఇంక్. ఫౌండర్&సీఈవో మనోజ్ లాద్వా ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ... యూకే - భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యూకే-ఇండియా సమావేశం ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచుకోవడం, నిజమైన ట్రాన్స్‌ఫార్మేషన్ అన్నారు.

ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభను సంగ్రహించేందుకు యూకే, భారత్ ముందున్నాయని చెప్పారు. ట్రాన్సాక్షనల్ మోడ్‌లోనే మనం ఉండలేమన్నారు. కాగా, లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ రెండు రోజుల పాటు జరగనుంది.

English summary
Stressing that India needs to take "far greater risks", Infosys President Mohit Joshi, who is in London to take part in 5th Annual UK-India Leadership Conclave, on Wednesday said Aadhaar, UIP and GST will create a solid foundation for a digital tax system in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X