వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారిస్ దాడుల సూత్రధారి హమీద్ హతం (వీడియో)

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ప్యారిస్ లో గత శుక్రవారం జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి అయిన అబ్దెల్ హమీద్ అబోద్ ను హతమార్చామని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అబ్దెల్ హమీద్ తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు అంతం అయ్యారని చెప్పింది.

అయితే ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుని విచారణ చేస్తున్నామని తెలిపింది. ఉత్తర ప్యారిస్ లోని సెయింట్ డెన్నిస్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదులు తల దాచుకున్నారని ఫ్రాన్స్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. బుధవారం వేకువ జామున ప్యారిస్ పోలీసులు ఆ పార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు.

ముందుగా పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పోలీసులు ఒకే సారి అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఉగ్రవాదులు విరుచుకుపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ముగ్గురు ఉగ్రవాదులను అపార్ట్ మెంట్ లోనే అంతం చేశారు. ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ ఎదురు కాల్పులలో పోలీసులకు గాయాలైనాయి. ప్యారిస్ ఉగ్రదాడి సూత్రధారి బెల్జియం జాతీయుడు అబ్దెల్ హమీద్ అబోద్ అంతం అయ్యాడని నిర్ధారించుకున్న తరువాత పోలీసులు అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు.

తీవ్రగాయాలైన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కాల్పులలో హతం అయిన ముగ్గురిలో ఓ మహిళా ఉగ్రవాది ఉందని పోలీసులు అంటున్నారు. అయితే ఇద్దరి పేర్లు, వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
A judicial source said a second person had died in the pre-dawn raid, but there was no immediate official confirmation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X