• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంట్లోనే ఉండి అబుదాబిలో అడ్వెంచర్స్ చేయాలనుందా.. అయితే స్టే క్యూరియస్ ఈ అవకాశం కల్పిస్తోంది

|

అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స్టే క్యూరియస్ అనే వర్చువల్ ఎక్స్ ప్లొరేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ప్రారంభించినట్లు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అబుదాబి ప్రకటించింది. మంచి ఎడ్యుకేషన్‌తో పాటుగా ఎంటర్‌టెయిన్‌మెంట్ కంటెంట్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇళ్లల్లో ఉండే ఎమిరేట్స్ వాతావరణం ఆ అనుభూతి పొందేలా డిజైన్ చేసినట్లు డీసీటీ అబుదాబీ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు లాక్‌డౌన్ విధించడంతో ప్రయాణాలకు బ్రేక్ పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ఔత్సాహికులకు స్టే క్యూరియస్ ఆహ్వానం పలుకుతోంది. లాక్‌డౌన్‌తో ప్రయాణించాలన్న తమ కోరికను స్టే క్యూరియస్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఐదు కంటెంట్స్‌తో స్టే క్యూరియస్ రెడీగా ఉంది.

* సాహసాలకు అడ్డుకట్టవేయొద్దు: వర్చువల్ పర్యటనలు మరియు అనుభవాల కేంద్రంగా సందర్శకులను అబుదాబి నడిబొడ్డుకు చేరవేస్తుంది. ఎమిరేట్ యొక్క అద్భుతమైన వీక్షణలు మరియు విభిన్న సమర్పణలతో వారిని మంత్రముగ్దులను చేస్తుంది.అబుదాబి చరిత్ర మరియు వారసత్వం గురించి పర్యాటకులకు విలువైన అవగాహనలను అందిస్తుంది.

* ఉత్సాహంగా ఉండండి: ఇక యూజర్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రుచికరమైన అబుదాబి వంటకాలు అందిస్తాము. ఇందుకోసం కుక్కింగ్ వర్క్‌షాపులు, మాస్టర్ క్లాసులను ఎమిరేట్‌లోని టాప్ చెఫ్‌లు నిర్వహిస్తారు.

* జ్ఞానం పెంచుకోండిలా: వర్చువల్ కోర్సులు, మరియు అగ్రగామిగా ఉన్న విద్యాసంస్థల బోధించే పాఠాల ద్వారా లోకజ్ఞానం పెంపొందించుకోవచ్చు. ఇందులో గూగుల్, కోర్సెరా, ఎమిరేట్స్ చరిత్ర, మకతాబా డిజిటల్ లైబ్రరీ ద్వారా పాఠాలు చెప్పబడుతాయి.

* క్రియేటివ్‌గా ఉండండి: స్టే క్యూరియస్ ద్వారా అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ కొత్తగా లాంచ్ చేసిన "కల్చర్అల్" వర్చువల్ అనుభవాలను ప్రేక్షకులకు పంచుతుంది. వారిలో ఉత్తేజాన్ని నింపుతుంది

* ఎంటర్‌టెయిన్‌మెంట్ : రానున్న వారాల్లో స్టే క్యూరియస్ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఎంటర్‌టెయిన్‌మెంట్‌ను డీసీటీ అబుదాబి పంచుతుంది.

Abu Dhabi Reignites Passion for Exploration with New Innovative Platform

ఈ కష్ట సమయంలో పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని అన్నారు అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అండర్‌సెక్రటరీ సావుద్ అల్ హోసానీ. ఈ వేదిక ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారిని ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి జీవన శైలిని, వారి అనుభవాలను పంచుకునే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో వారికి ఎంటర్‌టెయిన్‌మెంట్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, వారి వూహలను నిజం చేసేలా, ఎక్స్‌ప్లొరేషన్ పై ఆసక్తి ఉన్నవారికి స్టే క్యూరియస్ మంచి అవకాశం కల్పిస్తోందని చెప్పారు.

"అబుదాబి ఎప్పుడూ అపూర్వమైన ఆతిథ్యానికి ప్రసిద్ది చెందింది. మరియు మా మధ్య భౌతిక దూరం ఉన్నప్పటికీ, ఈ వినూత్న అనుభవం ద్వారా వర్చువల్ సందర్శకులను మా నగరం మరియు మా సంస్కృతి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో వ్యక్తిగతంగా సందర్శించేందుకు మంచి అవకాశంగా కూడా ఉంటుంది" అని అన్నారు సావుద్ అల్ హోసానీ. ఇక స్టే క్యూరియస్ ఆన్‌లైన్ ద్వారా కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం www.staycurious.aeని సందర్శించండి. రానున్న వారాల్లో మరిన్ని కొత్త కాన్సెప్ట్స్‌తో ఈ వేదిక దర్శనమిస్తుంది.

English summary
The Department of Culture and Tourism – Abu Dhabi (DCT Abu Dhabi) has announced the launch of its new virtual exploration platform, #StayCurious, which will provide audiences worldwide with original education and entertainment content in one comprehensive hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X