• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళ ఎలా బతికిందంటే.. అదృష్టం, అద్భుతం: జారిపడి సముద్రంలోనే 10గం.లు

By Srinivas
|

లండన్: ఎవరైనా సముద్రంలో పడిపోతే బతికే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ యూకే మహిళ ఒకరు సముద్రంలో పడి పది గంటలకు పైగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెను కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ అని తెలుస్తోంది. శనివారం రాత్రి పడిపోగా, ఆదివారం బయటకు తీశారు.

బ్రిటన్‌కు చెందిన సదరు యువతి క్రొయేషియాకు చెందిన నార్వేజియన్ స్టార్ ఓడలో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తోంది. పడవ అంచున నిలబడిన ఆమె తన స్నేహితులతో మాట్లాడుతోంది. ఆ సమయంలో కాలుజారి సముద్రంలో పడిపోయింది.

సముద్రంలో పడిపోయిన మహిళ

సముద్రంలో పడిపోయిన మహిళ

ఆమె పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీర ప్రాంతానికి అరవై మైళ్ల దూరంలో ఉంది. ఆమె సముద్రంలో పడిపోవడాన్ని గమనించిన ప్రయాణీకులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు. వారు అధికారులకు తెలియజేశారు. దీంతో నేవీ అధికారులు రంగంలోకి దిగారు.

అలా రక్షించారు

అలా రక్షించారు

గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీర ప్రాంత అధఇకారులు పీసీ 9 విమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ మహిళను కాపాడారు. ఈ విషయాన్ని ఆమె మీడియాకు తెలిపారు. ఆమె వయస్సు 46. క్రొయేషియాలోని పులా సమీపం వర్గరోలా పోర్ట్ నుంచి వెళ్లిన ఓడలో ఆమె ప్రయాణించింది.

బతకడం అద్భుతం, ఆశ్చర్యం

బతకడం అద్భుతం, ఆశ్చర్యం

ఆమెను రక్షించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆసుపత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బ్రిటిష్ మహిళను కాపాడి ఆసుపత్రికి తీసుకు వచ్చారని, ఆమె పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరోవైపు, దీనిపై క్రొయేషియా మినిస్ట్రీ ఆఫ్ మారిటైమ్ అఫైర్స్ అధికార ప్రతినిధి డేవిడ్ రాడాస్ మాట్లాడుతూ.. ఆమె కాలు జారి సముద్రంలో పడిందా లేక క్రూయిజ్ షిప్ నుంచి దూకిందా తెలియాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బ్రిటిష్ మహిళ బతకడంపై ఓడ కెప్టెన్ మాట్లాడుతూ.. ఓ మహిళను కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మహిళ బతికి బయటపడటం లక్కీ, అద్భుతం అని అంటున్నారు.

 ఇలా బతికానని చెప్పిన మహిళ

ఇలా బతికానని చెప్పిన మహిళ

సముద్రంలో పడిపోయి పది గంటల పాటు అందులోనే ఉన్నానని ఆ మహిళ చెప్పారు. అంతసేపు సముద్రంలో ఎలా ఉండగలిగారని ప్రశ్నిస్తే యోగా ఫిట్‌నెస్, పాటలు తాను అన్ని గంటలు బతికేందుకు ఉపయోగపడ్డాయని ఆమె చెప్పారు. తాను యోగా చేస్తానని, దీని వల్ల ఫిట్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. అలాగే, రాత్రంతా సముద్రంలో ఉంది. సముద్రం చల్లదనం ఫీల్ నుంచి బయటపడేందుకు ఆమె పాటలు పాడారని చెప్పారట. తాను వెనుక వైపు ఉన్న సమయంలో కిందపడ్డానని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The miracle British woman who survived 10 hours in the sea after falling off a cruise ship said her yoga fitness and singing helped her stay alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more