• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అఫ్ఘానిస్తాన్‌లో ఆమె సబల... తాలిబన్ల కింద ఇది సాధ్యమేనా..?

|

ఆ దేశంలో మహిళలపై ఆంక్షలు ఉంటాయి. బహిరంగ వేదికలపై మహిళలు కనిపించడం అంటే అదేదో నేరంగా పరిగణిస్తారు. అలాంటి కఠినమైన నిబంధనలున్న దేశంలో ఓ మహిళా తన సత్తా చాటింది. ఇప్పటి వరకు ఏ మహిళా సాధించని విజయాన్ని అందుకుంది... ఇంతకీ ఆ మహిళ ఎవరు... ఆ దేశం ఏమిటి... ఆమె సాధించిన విజయం ఏమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అఫ్గాన్ అమెరికన్ ఐడల్‌లో తొలిసారిగా మహిళ విజయం

అఫ్గాన్ అమెరికన్ ఐడల్‌లో తొలిసారిగా మహిళ విజయం

తాలిబన్‌ అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తొలిసారిగా ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన మహిళ 'అఫ్ఘాన్ అమెరికన్ ఐడల్' ఆఫ్ఘాన్ స్టార్ పాటల పోటీల్లో విజేతగా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన జహ్రా ఈల్హం ఈ పోటీలో మరో యువగాయకుడిపై గెలుపొందింది. అమెరికన్ ఐడల్‌, ఇండియన్ ఐడల్‌లా పోలి ఉండే ఈ ఆఫ్ఘాన్ స్టార్ షోలో జహ్రా ఈ ఘనత సాధించింది. 14 సీజన్ల నుంచి ఈ పోటీ జరుగుతుండటం విశేషం. పురుషాధిక్యం ఉన్న అఫ్ఘాన్‌లో వారిపై గెలిచి తన సత్తా ఏంటో చాటానని విజేతగా ప్రకటించాక ఆమె చెప్పింది.

నా ఈ విజయం ఆఫ్గానిస్తాన్‌ మహిళాలోకానికి అంకితం

నా ఈ విజయం ఆఫ్గానిస్తాన్‌ మహిళాలోకానికి అంకితం

"ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మాట్లాడేందుకు మాటలు రావటం లేదు. అఫ్ఘానిస్తాన్‌లోని ప్రతి ఆడపిల్లకు నా విజయాన్ని అంకితం చేస్తున్నాను. ఈరోజు ఒక్క జహ్రా ఈల్హం మాత్రమే విజయం సాధించలేదు. ఆఫ్ఘానిస్తాన్‌లోని ప్రతి ఆడపిల్ల, మహిళ విజయం సాధించింది" అని చెప్పి జహ్రా భావోద్వేగానికి గురైంది. జహ్రా ఈ మాటలు చెప్పగానే అక్కడ ఉన్న ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు. మంచి గొంతున్న జహ్రా.... ఇలాంటి పోటీల్లో పురుషులపై విజయం సాధించాలనేది తన కోరికగా ఉండేదని చెప్పుకొచ్చింది. 2005లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు పురుషులే విజయం సాధిస్తూ వచ్చారు. తొలిసారిగా మహిళ అయిన జహ్రా గెలుపొందింది.

ఆఫ్ఘాన్ పురుషులకు జహ్రా విజయం చెంప పెట్టులాంటిది

ఆఫ్ఘాన్ పురుషులకు జహ్రా విజయం చెంప పెట్టులాంటిది

ఇక జహ్రా గెలుపుతో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఆమెను అభినందించారు. తామే గొప్పవారమంటూ విర్రవీగే ఆఫ్ఘాన్ పురుషులకు జహ్రా విజయం ఒక చెంపపెట్టులాంటిదని ఒకరు కామెంట్ చేశారు. ఇక అమెరికా తాలిబన్ల మధ్య యుద్ధాన్ని విరమించాలని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్‌లోని చాలా మంది తాలిబన్లు తిరిగి అధికారంలోకి వస్తే తమ బతుకులు ఎలా మారుతాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాలిబన్లకు ఈసారి గట్టిగా బుద్ధి చెబుతామంటోన్న ఆఫ్గాన్ మహిళాలోకం

తాలిబన్లకు ఈసారి గట్టిగా బుద్ధి చెబుతామంటోన్న ఆఫ్గాన్ మహిళాలోకం

తాలిబన్ల పాలనలో యువతుల జీవితాలు తలుచుకున్నప్పుడు పెద్ద కన్నీటి గాథే కనిపిస్తుంది. తాలిబన్ల కింద మహిళల జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి. బురఖాలను దాటి వారి ముఖం బయటి ప్రపంచానికి చూపిస్తే చాలు నేరంగా పరిగణించి వారికి శిక్ష విధించేవారు తాలిబన్లు. అయితే ఈ సారి మాత్రం తాలిబన్ల పాలనకు భయపడేది లేదంటూ అక్కడి మహిళాలోకం తెగేసి చెబుతోంది. ఎంతో కష్టపడి సాధించుకున్న తమ హక్కులను తాలిబన్లు కాలరేసేందుకు ప్రయత్నిస్తే గట్టిగా బుద్ధి చెబుతామని మహిళాలోకం ధైర్యంగా చెబుతోంది. ఆఫ్ఘానిస్తాన్‌ ఎలా ఉండాలో సూచిస్తూ తాలిబన్లు కొన్ని సూచనలు చేశారు. మహిళల పట్ల ఇప్పటి వరకు తాలిబన్లు ఎప్పుడూ సానుకూలంగా లేరు. మహిళలు బహిరంగ వేదికలపై కనిపించడం ఇస్లాం మతానికి వ్యతిరేకమని చెబుతూ వచ్చారు. మరి జహ్రా విజయంతో అక్కడి మహిళల్లో మరింత ధైర్యం నింపుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

English summary
An Afghan woman has become the first to win a popular singing competition, with her victory coming as fears grow that women could lose hard-won rights if the US does a peace deal with the Taliban.Zahra Elham, in her 20s and from Afghanistan’s Hazara ethnic minority, snatched first place from her male runner-up on Afghan Star,a local version of American Idol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more