వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్ గడ్డపై మరో మలాలా - తల్లితండ్రులను చంపిన తాలిబన్లపై కాల్పులు.. ఆప్ఘన్ గిరీపై ప్రశంసలు..

|
Google Oneindia TeluguNews

నిత్యం ఘర్షణలతో అట్టుడికే ఆప్ఘనిస్తాన్ గడ్డపై తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో చదువు కోసం తాలిబన్లనే ఎదిరించి ప్రాణాలకు తెగించి పోరాడిన యూసుఫ్ మలాలా ఘటన మర్చిపోక ముందే మరో సాహస బాలిక తన తల్లితండ్రులను చంపిన ఉగ్రవాదులపై ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టింది. దీంతో ఆమె సాహసం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని గంట్లలోనే చర్చనీయాంశమైంది. ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆమెతో పాటు సోదరుడిని కూడా అధ్యక్ష భవనానికి ఆహ్వానించారు. సోషల్ మీడియా సైతం ఆమె సాహసానికి ఫిదా అయిపోయింది.

 ఆప్ఘన్ గడ్డపై మరో మలాలా...

ఆప్ఘన్ గడ్డపై మరో మలాలా...


ఆప్ఘనిస్తాన్ లో మహిళలు, ఆడ పిల్లలపై తాలిబన్ల అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆడవాళ్లు ఇళ్లకే పరిమితం కావాలని కోరుకునే తాలిబన్లు వారిని బయటికి రానివ్వకుండా, చదువుకోనివ్వకుండా అడ్డుకున్న ఘటనలు కోకొల్లలు. కానీ ఇలాంటి తాలిబన్ల దారుణాలను ఎదిరించి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చదువుకున్న యూసుఫ్ జాయ్ మలాలా ఆ తర్వాత నోబెల్ పురస్కారానికి కూడా ఎంపికైంది. ఇప్పుడు ఆమె నుంచి స్ఫూర్తి పొందిందా అన్నట్లుగా కమర్ గుల్ అనే ఓ 15 ఏళ్ల బాలిక తాలిబన్లపై గురిపెట్టింది. తన తల్లితండ్రులను చంపేసిన తాలిబన్లపై ఎదురుకాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టింది. ఆప్ఘనిస్తాన్ లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్ లోని ఓ కుగ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కళ్లముందే తల్లితండ్రులు హతం...

కళ్లముందే తల్లితండ్రులు హతం...

ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారనే కారణంతో కమర్ గుల్ తల్లితండ్రులను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నెల 17న అదను చూసి వారిని హతమార్చేందుకు ప్లాన్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నిదురిస్తున్న కమర్ గుల్ తల్లితండ్రులను తలుపుతట్టి లేపారు. వెంటనే కాల్పులు ప్రారంభించారు. అడ్డుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి కమర్ గుల్ తో పాటు ఆమె సోదరుడి కళ్లముందే తల్లితండ్రులు రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో పిల్లలు భయపడిపోతారు. తాలిబన్ల అకృత్యాలు తెలిసిన వారయితే వదిలిపెట్టమని ప్రాణభిక్ష కోరుకుంటారు. కానీ కమర్ గుల్ అలా చేయలేదు.

 తాలిబన్లకు చుక్కలు చూపించిన కమర్ గుల్...

తాలిబన్లకు చుక్కలు చూపించిన కమర్ గుల్...

కళ్ల ముందే తల్లితండ్రులను తాలిబన్లు హతమార్చడంతో చలించిపోయిన కమర్ గుల్ తిరగబడింది. తల్లితండ్రులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై తన ఇంట్లో ఉన్న ఏకే 47 తుపాకీతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపేసింది. అంతే కాదు దాదాపు గంటకు పైగా ఉద్ధృతంగా పోరాడి వారిని అక్కడి నుంచి తరిమికొట్టింది. పక్కనే 12 ఏళ్ల తమ్ముడిని ఉంచుకుని ఆమె చేసిన పోరాటం తాలిబన్లకు పీడకలలా నిలిచింది. కమర్ గుల్ ఎదురుకాల్పుల్లో పలువురు తాలిబన్లు గాయపడ్డారు. గంటసేపు సాగిన పోరాటం తర్వాత ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లతో పాటు గ్రామస్ధులు ఆమెకు సహాయంగా అక్కడికి చేరుకున్నారు. పరిస్ధితిని గమనించిన తాలిబన్లు అక్కడి నుంచి పారిపోయారు.

Recommended Video

Chabahar Port : No Deal With India On Chabahar Railway Project - Iran || Oneindia Telugu
ఆప్ఘాన్ గిరీకి సర్కార్ ప్రశంసలు- సోషల్ మీడియా హోరు....

ఆప్ఘాన్ గిరీకి సర్కార్ ప్రశంసలు- సోషల్ మీడియా హోరు....

తాలిబన్లపై భీకర దాడి చేసి ఇద్దరిని మట్టుబెట్టడమే కాకుండా పలువురిని తీవ్రంగా గాయపరిచిన కమర్ గుల్ సాహసం కొన్ని గంటల్లోనే ఆప్ఘన్ ప్రభుత్వం వరకూ వెళ్లింది. దీంతో ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కమర్ గుల్ తో పాటు ఆమె సోదరుడిని కూడా ప్రభుత్వ భద్రతతో అధ్యక్ష భవనానికి రావాలని ఆహ్వానించారు. కమర్ గుల్ సాహసంపై ఆప్ఘన్ ప్రభుత్వం ప్రసంశల జల్లు కురిపించింది. కమర్ గుల్ పోరాటం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తం అయింది. పలు దేశాల నుంచి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, సాధారణ ప్రజలు, నెటిజన్లు ఆమె సాహసాన్ని ఆప్ఘాన్ గిరీగా అభివర్ణిస్తూ అభినందిస్తున్నారు. మలాలా కంటే మెరుగ్గా తాలిబన్లపై పోరాటం చేసిన కమర్ గుల్ సాహసం ఓ అరుదైన ఫీట్ అని ప్రశంసిస్తున్నారు.

English summary
A teenage Afghan girl has been hailed on social media for her "heroism" after fighting back last week against Taliban militants who killed her parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X