వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులతో చేతులు కలిపిన సైనికులు

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఉగ్రవాదులతో పోరాటం చేసి మాతృదేశాన్ని కాపాడుకుని దేశభక్తిని చాటుకోవలసిన సైనికులు ప్లేటు పిరాయించారు. పోరాటం చేస్తున్న సైనికులు ఏకంగా ఉగ్రవాదుల దగ్గర తలవంచి వారికి తొత్తులుగా మారిపోయారు.

అఫ్ఘనిస్థాన్ లో ఈ సంఘటన జరిగింది. తమ సైన్యంలోని 125 మంది రక్షణా సిబ్బంది తాలిబన్లతో కలిసిపోయారని అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అఫ్టనిస్థాన్ లోని త్రిగరన్ లోయలో తాలిబన్లతో సైన్యం పోరాటం చేస్తున్నది.

 Afghan Security Personnel Join Taliban in Afghan

గత నాలుగు రోజుల నుండి సైనికులు తాలిబన్ల మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఒక్క సారిగా సీన్ రివర్స్ అయ్యింది. యుద్దం చేస్తున్న సైనికులు తాలిబన్లతో కలిసిపోయారు. విషయం తెలుసున్న అధికారులు షాక్ కు గురైనారు.

త్రిగరన్ లోయలో జరుగుతున్న యుద్దంలో 20 మంది తాలిబన్ ఉగ్రవాదులు, 10 మంది సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సైనికులు తాలిబన్లతో చేరిపోవడంతో త్రిగరన్ లోయ వారి ఆధీనంలోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.

English summary
After three days of fierce fighting between the government forces and Taliban rebels for the control of Tirgaran valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X