• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral Video : కమెడియన్‌ను చంపింది తాలిబన్లే... హత్యకు ముందు వీడియో వెలుగులోకి...

|

ఆఫ్ఘనిస్తాన్ పాపులర్ కమెడియన్ నాజర్ మహమ్మద్, అలియాస్ ఖాషా జ్వాన్ హత్య తాలిబన్ల పనేనని వెల్లడైంది. ఈ విషయాన్ని తాలిబన్లే స్వయంగా ప్రకటించారు. ఈ హత్యతో తమకు సంబంధం లేదని తాలిబన్లు మొదట ప్రకటించినప్పటికీ... ఖాషా జ్వాన్‌పై దాడికి పాల్పడిన వీడియో వెలుగుచూడటంతో తామే అతన్ని హత్య చేసినట్లు ప్రకటించారు. ఇస్లాం ప్రకారం ప్రజలను నవ్వించడం నేరమని... అందుకే అతన్ని హత్య చేశామని తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ హత్య తమవాళ్లు చేసినదేనని ధ్రువీకరించారు.

భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఖాషా జ్వాన్‌ చేతులను కట్టేసి.. అతన్ని చెంప దెబ్బలు కొట్టడం కనిపిస్తోంది. ఓ వాహనంలో ఖాషాను బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లిన తాలిబన్లు... అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించి హత్య చేశారు.

afghan taliban admit comedian murder video of beating him gone viral

తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ ఘటనపై మాట్లాడుతూ... నిజానికి ఖాషాను హత్య చేయడం కంటే అతన్ని తాలిబన్ కోర్టు ముందు హాజరుపరచాల్సిందని అన్నారు. ఖాషా గతంలో కాందహార్ ప్రావిన్స్‌లో పోలీస్‌గా పనిచేసినప్పుడు తాలిబన్లను హింసించి హత్య చేసిన ఘటనల్లో అతనికి ప్రమేయం ఉందని ఆరోపించారు.ఎంతోమంది తాలిబన్లను అతను హత్య చేశాడన్నారు.

మరోవైపు కాందహార్ పోలీస్ కమాండర్ సైలబ్ తాలిబన్ల ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఖాషాను ఎప్పుడూ యుద్ధ క్షేత్రంలో దింపలేదన్నారు. చెక్ పాయింట్ల వద్ద విధుల్లో ఉన్న సమయంలో తన హాస్యంతో అతను అధికారులను ఎంటర్టైన్ చేసేవాడన్నారు.

ఖాషా జ్వాన్ టిక్‌టాక్ వీడియోలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. తనదైన హాస్యంతో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ నెల 27న అతని ఇంట్లో చొరబడ్డ తాలిబన్లు బలవంతంగా అతన్ని లాక్కెళ్లి హత్యకు పాల్పడ్డారు. ఆ హత్యకు ముందు అతనిపై దాడికి పాల్పడిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖాషా హత్యపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

కొద్ది నెలల క్రితమే ఆఫ్ఘన్ గడ్డ నుంచి అమెరికా,నాటో దళాలు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌ను పట్టి పీడిస్తున్న తాలిబన్,అల్‌ఖైదా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా,నాటో దళాలు... ఆ పనిని పూర్తి చేయకుండానే నిష్క్రమించాయి.గతేడాది మే 1న దోహాలో అమెరికా,తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఈ సెప్టెంబర్‌ 11వ తేదీలోగా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. కానీ అంతకు రెండు నెలలు ముందు గానే అక్కడి నుంచి అమెరికా,నాటో దళాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించాయి. అగ్రరాజ్య దళాలు అక్కడినుంచి నిష్క్రమించడంతో తాలిబన్లకు ఇక అడ్డూ అదుపు లేకుండా పోయింది. శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నారు.

English summary
A cruel and devastating incident took place in Afghanistan, in which the Taliban shot an Afghan police officer, Fazal Mohammad, who was better known for posting humorous videos online. The Taliban even claimed that the policer officer was killed by them for making people laugh. Soon after this the visuals of him being beaten as well as his dead body emerged on social media platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X