వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రర్ అటాక్: ఆప్ఘనిస్థాన్‌లో 40 మంది పోలీసులు మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది పోలీసులు చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గురువారం ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మిలిటరీ వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని మూడు సూసైడ్ బాంబర్లు తనను తాను పేల్చుకున్నారు.

కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతమైన పాగ్మన్ జిల్లాకు ఈ మిలిటర్ కాన్వాయ్‌ వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై స్పందించిన గవర్నర్ హజీ మహమ్మద్ ముసా ఖాన్ మృతుల సంఖ్య మరితంగా పెరిగే అవాకశం ఉందన్నారు.

 Afghanistan: 40 killed in Kabul terror attack

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని విమానాశ్రయంలో ఉగ్రదాడికి పాల్పడి 100మందికి పైగా ప్రాణాలను బలిగొన్న మరుసటి రోజునే ఈ దాడి జరగడం విశేషం. కాగా, ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని తాలిబన్ సంస్ధ ప్రకటించుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు 64 మంది చనిపోయారు.

తాలిబన్ అధినేత ముల్లా అక్తర్ మన్సూర్ చనిపోయిన తర్వాత ఆప్ఘనిస్థాన్ ఆర్మీపై ఉగ్రవాద సంస్ధ తాలిబన్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నెలలో ఆప్ఘనిస్థాన్ మిలిటరీపై జరిగిన రెండో అతిపెద్ద దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. జూన్ 21న ఓ బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులు 12 మంది నేపాలీలతో పాటు ఇద్దరు భారతీయలను పొట్టన బెట్టుకున్నారు.

English summary
At least 40 people have been reportedly killed in a major terror attack in Afghanistan. The extremist assault has been reported from Afghan capital Kabul. A suicide bomber reportedly targeted a military convoy, which resulted in the death of 40 security personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X