వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియల్లో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

శనివారం కాబూల్ లోని ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో వ‌రుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో భార‌త‌ దౌత్య కార్యాలయం సమీపంలో మొన్న సంభ‌వించిన‌ భారీ పేలుళ్ల ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే.. మరోసారి కాబూల్ బాంబుల మోతతో దద్దరిల్లింది.

శనివారం కాబూల్ లోని ఖేర్ ఖానా ప్రాంతంలోని స్మశానవాటికలో వ‌రుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

kabul-bomb-blast

ఈ పేలుళ్లలో 18 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. మృతుల సంఖ్య మ‌రింత‌ పెరిగే అవకాశముందని అక్క‌డి అధికారులు తెలిపారు. ఇటీవ‌ల కాబూల్‌లో జ‌రిగిన‌ భారీ పేలుళ్లకు నిరసనగా ఆ ప్రాంతంలో నిన్న‌ భారీ ర్యాలీ చేపట్టారు.

ఆందోళ‌న‌కారుల‌ను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఈ కాల్పుల్లో సెనేటర్‌ ఎజద్యార్‌ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ రోజు అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మళ్లీ ఈ వ‌రుస బాంబు పేలుళ్ల ఘ‌ట‌న చోటుచేసుకుంది.

English summary
Three explosions ripped through a funeral for a victim of violent clashes between Afghan police and protesters in Kabul on Saturday, killing at least 18 people and injuring 30 more. “Many people have been killed and wounded at the funeral of Salim Izdyar”, the son of prominent Afghan politician Mohammad Alam Izdyar, witness Abdul Wudood told AFP. Afghan media reports said the three blasts at the cemetery in Khair Khana area of Kabul killed 18 people and wounded 30 others. Security forces cordoned off the cemetery and advised people to avoid the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X