వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్కినాఫాసో కేఫ్‌లో ఉగ్రదాడి: 17మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్‌ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

|
Google Oneindia TeluguNews

బుర్కినాఫాసో: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్‌ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నారని ఆఫ్రికన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Africa: 17 dead in Burkina Faso cafe attack

ఈ దాడి కారణంగా వాగాదుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదని పోలీసులు వెల్లడించారు. బుర్కినాఫాసోలో గత రెండేళ్ల కాలంలో ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి. గత సంవత్సరం జనవరిలో ఓ కేఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు 30మంది పౌరుల ప్రాణాలు తీశారు.

English summary
17 persons have died in an attack by gunmen on a Turkish restaurant, The attack was carried out on Sunday in the Burkina Faso, a West African country that has seen a surge in violence by Islamic extremists over the past few years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X