వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కదిలితే చంపేస్తా.. 9 గంటలు ఏకధాటిగా టీవీలో అది చూడాల్సిందే..'

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కుల వివక్ష లాగే అమెరికాలో వర్ణ వివక్ష అనే సమస్య ఉంది. ఒకప్పుడు అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న వర్ణ వివక్షపై అలెక్స్ హేలీ అనే రచయిత 'రూట్స్' అనే నవల రాశారు. ఆ నవలలో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించడాన్ని రచయిత వివరించారు. ఆ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేసే తీరు.. అమెరికాకు తీసుకొచ్చాక వారిపై సాగించే దురాగతాలు వర్ణనాతీతం. ఇప్పటికీ అడపాదడపా వర్ణ వివక్ష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా అమెరికాలో కాస్త విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.

 ఏకధాటిగా 9 గంటలు..

ఏకధాటిగా 9 గంటలు..

ఆఫ్రో అమెరికన్ రాబర్ట్ నోయెస్ (52) ఇటీవల ఓ తెల్లజాతి మహిళను కిడ్నాప్ చేశాడు. నిజానికి వారిద్దరు చాలా ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల ఆమెను కిడ్నాప్ చేసిన రాబర్ట్.. తన ఇంటికి తీసుకెళ్లి విచిత్రమైన పనిష్‌మెంట్ ఇచ్చాడు. ఏకధాటిగా 9 గంటలు 'రూట్స్' మినీ సిరీస్‌ను చూడాలని బలవంతం చేశాడు. టీవీ ముందు నుంచి కదిలితే చంపేస్తానని బెదిరించాడు.

రేసిజం గురించి తెలియజెప్పేందుకే..

రేసిజం గురించి తెలియజెప్పేందుకే..

రేసిజం(వర్ణ వివక్ష) గురించి ఆమెకు అర్థం చేయించేందుకే రాబర్ట్ ఆ పనిచేసినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. టీవీ ముందు నుంచి కదిలితే హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పారేస్తానని ఆమెను అతను హెచ్చరించినట్టు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Recommended Video

US House Votes To Clip Trump's Wings On Iran || Oneindia Telugu
 రూట్స్ నవల..

రూట్స్ నవల..

అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ద 'రూట్స్' నవల 1977లో టీవీ సిరీస్‌ గానూ రూపుదిద్దుకొంది. తన మూలాలను వెతుక్కుంటూ ఏడు తరాల బానిస గోసను హేలీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన ప్రస్థానంగా ఏడు తరాలను అభివర్ణించవచ్చు. 1619లో ఆఫ్రికన్లను బానిసలుగా అమెరికాకు తరలించడం మొదలైనట్టు రచయితో పుస్తకంలో ప్రస్తావించారు. అక్కడ వారిని తమకు నచ్చిన రేటుకు విక్రయిస్తుంటారు. మొదట్లో కేవలం 20 మందితో మొదలైన బానిసల సంఖ్య ఆ తర్వాత 1810 నాటికి సుమారు 10లక్షలు దాటింది. తత్ఫలితంగా అమెరికాలో అంతర్యుద్దం మొదలై 1865లో ముగిసింది.

English summary
An African American man kidnapped a white woman he'd been in an on-off relationship with for years and forced her to watch nine-hour slavery miniseries Roots so she could 'understand her racism'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X