వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా పై ఇరాన్ క్షిపణి దాడులు: చాలామంది సైనికుల తలకు తీవ్రగాయాలు,పెంటగాన్ వెల్లడి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఈ నెల ప్రారంభంలో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సొలేమానీని అమెరికా వైమానిక దళం హతమార్చింది. అయితే ఇందుకు ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాక్ బేస్‌లో మోహరించిన బలగాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో 34 మందికి తలపై తీవ్ర గాయాలైనట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్య ముందుగా ప్రకటించిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇరాన్ దాడులు నిర్వహించగానే అమెరికా సైన్యంలో ఒక్కరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 11 దళాల్లోని అమెరికా సైనికులకు గాయాలైయ్యాయని వారిని ఇరాక్ నుంచి చికిత్స కోసం అమెరికా తరలించినట్లు అమెరికా మిలటరీ వర్గాలు గతవారం చెప్పాయి. ఇప్పటికే 17 మంది సైనికులకు చికిత్స పూర్తయ్యిందని వారు తిరిగి విధుల్లో చేరేందుకు ఇరాక్‌కు వెళ్లారని పెంటగాన్ ప్రతినిధి జోనాథాన్ హామ్‌మన్ చెప్పారు.

After Iran missile strike, 34 US troops diagnosed with traumatic Brain injury

ఇక మరో ఎనిమిది మందిని చికిత్స కోసం ముందుగా జర్మనీకి తరలించి ఆ తర్వాత అమెరికాకు తరలించినట్లు ఆయన చెప్పారు. మరో 9 మంది సైనికులు జర్మనీలోనే చికిత్స పొందుతున్నట్లు హాఫ్‌మాన్ చెప్పారు. ఇక వీరిలో తలనొప్పి, డిజినెస్, వెలుగుకు తట్టుకోలేకపోవడం, నాసియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పినట్లు హాఫ్‌మాన్ చెప్పారు.

ఇదిలా ఉంటే సైనికులు తలనొప్పితో బాధపడుతున్నట్లు తనకు సమాచారం అందిందని బుధవారం రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికాపై ఇరాక్ చేసిన దాడుల్లో గాయాలపాలైన విషయం బయట పెట్టే క్రమంలో తాము జాప్యం చేయలేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్రెయిన్ ఇంజ్యూరీ అయిన వారి పరిస్థితిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారిని ఎలా ఆదుకుంటారనే దానిపై అమెరికా మిలటరీ విధానాల్లో స్పష్టత లేదు. అయితే అమెరికా ప్రజలకు, మిలటరీకి పారదర్శకతతో కూడిన సమాచారం ఇచ్చేలా చూడాలని పెంటగాన్ అధికారి హాఫ్ ‌మాన్ ఆదేశాలిచ్చారు.

English summary
The Pentagon said on Friday that 34 service members had been diagnosed with traumatic brain injury following missile strikes by Iran on a base in Iraq earlier this month, a number higher than the military had previously announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X