వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: హిల్లరీకి 'తొలి' షాక్, న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్ ముందంజ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తొలి ఫలితంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిచినా, ఆ తర్వాత న్యూహాంప్‌షైర్‌లోని మూడు చున్న పట్టణాల ఫలితాలు విడుదలతో.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్లారు. ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

మూడు నగరాలు.. డిగ్జివిల్లే నాచ్‌, హార్ట్స్‌ లొకేషన్‌, మిల్లీస్‌ఫీల్డ్‌లలో అర్ధరాత్రి పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ట్రంప్‌ 32 ఓట్లు గెలుచుకోగా, హిల్లరీ 25 ఓట్లు గెలుచుకున్నారని తెలుస్తోంది. ఈ మూడు నగరాల్లో కలిపి వంద మంది కంటే తక్కువ ఓటర్లు ఉంటారు.

After midnight vote, Trump ahead of Clinton 32-25 in New Hampshire in US Presidential poll

తొలి ఫలితం విడుదలైన డిగ్జివిల్లే నాచ్‌లో హిల్లరీకి నాలుగు ఓట్లు, ట్రంప్‌కు రెండు ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. హార్ట్స్‌ లొకేషన్‌ టౌన్‌లో కూడా హిల్లరీదే ఆధిక్యం. హిల్లరీకి 17 ఓట్లు రాగా, ట్రంప్‌కు 14 ఓట్లు వచ్చాయి.

మిల్లీస్‌ఫీల్డ్‌లో ట్రంప్‌ 16 ఓట్లు గెలుచుకోగా, హిల్లరీ నాలుగు ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. మూడు ప్రాంతాల్లో కలిపి ట్రంప్‌కు 32, హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి. అమెరికాలో టైమ్ జోన్ల తేడా వల్ల కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగుతుండగానే, కొన్నిచోట్ల ఫలితాలు విడుదలవుతుంటాయి.

తొలి ఫలితంలో హిల్లరీ, ఆ తర్వాత ట్రంప్ ముందంజలో ఉండటంతో క్షణం క్షణం ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.

English summary
After midnight vote, Trump ahead of Clinton 32-25 in New Hampshire in US Presidential poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X