వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాల తర్వాత అల్లర్లు : ఆరుగురి మృతి : ఎక్కడంటే ?

|
Google Oneindia TeluguNews

జకార్తా : ఇండోనేషియా అధ్యక్ష ఫలితాలు నిరసనకు వేదికయ్యాయి. గత నెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలను మంగళవారమే ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం వెల్లడించాల్సి ఉంది. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒకరోజు ముందుగా విడుదల చేశారు. అయినా ఆందోళనకారులు రెచ్చిపోయారు. దాడులకు తెగబడటంతో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందారు.

మిన్నంటిన ఆందోళనలు
ఫలితాలు విడుదలయ్యో లేదో అభ్యంతరాలు మిన్నంటాయి. రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇండోనేషియా నేషనల్ పోలీస్ చీఫ్ టిటో కర్ణవియన్ కూడా ఉన్నట్టు స్థానిక వైద్యులు పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. నిరసనకారుల ఆందోళనలో పోలీస్ బాస్ చనిపోవడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. మరో 200 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లర్ల తర్వాత ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వారు వివరించారు.

after results clash in indonesia, 6 dead

తిరిగి ఎన్నిక .. ఎగిసిన జ్వాల
ఇండోనేషియాలో అధ్యక్షుడు జోకో విడోడో తిరిగి ఎన్నికయ్యారు. వాస్తవానికి జోకో విడోడోపై దేశంలో అసంతృప్తి ఉంది. ఆయన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనతో ఇండోనేషియా రక్తమోడింది. మరోవైపు జోకో మోసపూరిత విధానాలతో గెలిచారని ఆయన ప్రత్యర్థి ప్రబోవో సూబియాంటో ఆరోపిస్తున్నారు. ఇటు జకర్తా గవర్నర్ అనీస్ బస్వాడెన్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు.

English summary
Indonesia's presidential outpouring protests. The results of the election on the 17th of last month were announced on Tuesday. According to the schedule, Wednesday is to be revealed. But the situation in the country has been released one day earlier. Still, the protesters got scared. So far, six people have been killed so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X