వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేర్ గ్రిల్స్ ఈజ్ బ్యాక్: తేనేటీగల దాడి తర్వాత ఈ సాహసికుడు ఎలా ఉన్నాడో చూడండి..!

|
Google Oneindia TeluguNews

బేర్ గ్రిల్స్... ఒక సాహసికుడు. ప్రధాని నరేంద్ర మోడీని ఒక సాహసయాత్రకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆ సమయంలో ప్రధాని మోడీ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరించారు. దీంతో ఒక్కసారిగా బేర్ గ్రిల్స్ అంటే ఎవరో ప్రతి భారతీయుడికి తెలిసింది. ఈ మధ్యే బేర్ గ్రిల్స్ ఓ సాహసం చేస్తున్న సందర్భంలో ఆయన్ను తేనెటీగలు కుట్టాయి. దీంతో ఆయనకు ఎలర్జీ వచ్చింది. ప్రాణాల నుంచి తృటిలో తప్పించుకున్న బేర్ గ్రిల్స్ వెనకడుగు వేయలేదు. తిరిగి తన సాహస యాత్రను కొనసాగించాడు.

కర్తాపూర్ కారిడార్‌కు బ్రేకులు: భక్తుల నుంచి సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న పాక్కర్తాపూర్ కారిడార్‌కు బ్రేకులు: భక్తుల నుంచి సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న పాక్

 రియాలటీ షో చేస్తుండగా తేనెటీగలు దాడి

రియాలటీ షో చేస్తుండగా తేనెటీగలు దాడి

తేనెటీగలు కుట్టిన సమయంలో ఆయన కొందరిని తనతో పాటు ఓ ద్వీపంలో ఉన్నాడు. అది పసఫిక్ ప్రాంతంలోని ఓ మారుమూల ద్వీపం. ఆ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తేనెటీగలు అతనిపై దాడి చేశాయి. దీన్ని కూడా షూట్ చేద్దామని భావించిన బేర్‌గ్రిల్స్ తన పరిస్థితి దారుణంగా తయారవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక తేనెటీగలు దాడి చేయడంతో శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చిందని అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నట్లు బేర్ గ్రిల్స్‌కు ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు తెలిపారు. ఇక తేనెటీగలు కుట్టడంతో వాటినుంచి విడుదలైన విషం లాంటి ద్రవంను కౌంటర్ చేసేందుకు డాక్టర్లు ఎపిపెన్ అనే ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.

ప్రమాదాలతో ఆడుకోవడం అంటే గ్రిల్స్‌కు మహాసరదా

ప్రమాదాలతో ఆడుకోవడం అంటే గ్రిల్స్‌కు మహాసరదా

ఇక బేర్ గ్రిల్స్ తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడం ఇది తొలిసారి కాదు. 2016లో కూడా ఓ సర్వైవర్ సిరీస్ కోసం షూట్ చేస్తున్న సమయంలో తేనె కోసం తేనెతట్టును కదిపాడు. ఆ సమయంలో బేర్ గ్రిల్స్ కళ్లపై స్వెల్లింగ్ వచ్చేసింది. దీంతో తన ఫోటోను చూసిన చాలామంది బేర్ గ్రిల్స్ కాస్త ప్రముఖ నటుడు బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్‌లా ఉన్నాడంటూ కామెంట్ చేశారు. బేర్ గ్రిల్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ఈ సెప్టెంబర్‌లోనే టెలికాస్ట్ కానుంది. ఇదొక రియాలటీ షో. ఇందులో ప్రిన్స్ ఫిలిప్ బంధువైన ఓ 75 ఏళ్ల బామ్మ కూడా పాల్గొంటున్నారు.

ఆసక్తికరంగా మారిన ట్రెజర్ ఐలాండ్ రియాలటీ షో

ఆసక్తికరంగా మారిన ట్రెజర్ ఐలాండ్ రియాలటీ షో

ఇక ఈ షో పేరు ట్రెజర్ ఐలాండ్‌ విత్ బేర్ గ్రిల్స్ అని పెట్టారు నిర్వాహకులు. ఈ రియాలటీ షోలో 12 మంది పోటీదారులు ఉంటారు. వీరంతా లక్ష పౌండ్ల స్టెర్లింగ్‌‌ల కోసం పోటీపడుతున్నారు. ఇందులో డజను మంది పోటీదారులు ఒక ద్వీపం పై 35 రోజుల పాటు ఉంటారు. ఇక వారంతా ఈ 35 రోజులు సొంతంగా ఆహారం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉండేందుకు సొంత గూడును నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు తాగునీరు కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ ద్వీపంపై ప్రైజ్ మనీని ఓ చోట ఉంచారు. అది ఎక్కడుందో కనుగొనాల్సి ఉంటుంది. అయితే పోటీ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తే వారికి ఎలాంటి బహుమతి ఉండదు.

English summary
Bear Grylls,who has an allergy to bee stings - was on a boat taking a new batch of adventure junkies to an island in a remote part of the Pacific on the first day of filming for the Channel 4 series when disaster struck.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X