వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా ట్రంప్ వల్లే: ఉ.కొరియా, ఐక్య రాజ్య సమితికి అమెరికా మరో షాక్

ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పించింది. అసలు యుద్ధానికి నిప్పు పెట్టింది అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అని ఆరోపించింది. ఓ పక్క క్షిపణి పరీక్షకు సిద్ధమవుతూనే ట్రంప్ పైన విరుచుకుపడింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పించింది. అసలు యుద్ధానికి నిప్పు పెట్టింది అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అని ఆరోపించింది. ఓ పక్క క్షిపణి పరీక్షకు సిద్ధమవుతూనే ట్రంప్ పైన విరుచుకుపడింది.

ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్‌ హో రష్యా అధికారిక మీడియాతో మాట్లాడారు. మా దేశ ప్రజల ప్రాణాలు రక్షించుకోవడానికి, శాంతిభద్రతల కోసమే తాము అణు పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఐక్య రాజ్య సమితి వేదికగా ట్రంప్‌ పిచ్చిపట్టినట్లుగా తమై వ్యాఖ్యలు చేశారన్నారు.

యుద్ధానికి నిప్పు పెట్టింది ట్రంప్

యుద్ధానికి నిప్పు పెట్టింది ట్రంప్

తమపై యుద్ధానికి నిప్పు పెట్టింది ట్రంప్ అని, తాము కూడా ఆ యుద్ధానికి మాటలతో కాకుండా మంటలతో సమాధానం చెబుతామని, అమెరికా శక్తిసామర్థ్యాలతో సమంగా తాము సిద్ధమవుతున్నామని, తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఇదే చివరి దశ అని ఆయన చెప్పారు.

Recommended Video

North Korea Angry over Trump's Tweet యుద్ధం ప్రకటించిన ట్రంప్,అమెరికా క్షిపణులు ధ్వంసం | Oneindia
 అణ్వాయుధాల గురించి చర్చ వస్తే మాట్లాడబోం

అణ్వాయుధాల గురించి చర్చ వస్తే మాట్లాడబోం

తమ అణ్వాయుధాల గురించి చర్చలు వస్తే వాటిపై మాట్లాడేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ హెచ్చరికలు

కాంగ్రెస్ హెచ్చరికలు

ఉత్తర కొరియాకు గురువారం కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేసింది. న్యూక్లియర్ ఈఎంపీ బాంబ్ వేస్తే 90 శాతం మంది అమెరికన్లు మృతి చెందుతారని హెచ్చరించింది.

 ఐరాసకు అమెరికా మరో షాక్

ఐరాసకు అమెరికా మరో షాక్

యునెస్కో నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఐక్య రాజ్య సమితికి అమెరికా మరో షాకిచ్చింది. ఐరాసలోని మిగతా అనుబంధ సంస్థలపై కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా శాశ్వత సభ్యత్వ ప్రతినిధి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

నిక్కీ హేలీ ప్రకటన విడుదల

నిక్కీ హేలీ ప్రకటన విడుదల

తమ విలువలకు విరుద్ధంగా నడుచుకునే విధానాలకు స్వస్తి చెప్పకుంటే అమెరికా పన్ను చెల్లింపుదారులు సదరు సంస్థలతో కూడా తెగతెంపులు చేసుకుంటారంటూ హెచ్చరించారు. న్యాయం, ఇంగితజ్ఞానాన్ని పరిహాసం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరుక అమెరికా దౌత్యవేత్త నిక్కీ హేలీ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ అమెరికా ఐరాస అనుబంధ సంస్థ యునెస్కోకు గురువారం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Hours after the Trump administration announced the US would be withdrawing from UNESCO, the United States ambassador to the United Nations, Nikki Haley, warned the world body that all its agencies are under similar scrutiny.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X