వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిక్స్: పుతిన్‌కు థ్యాంక్స్, జిన్‌పింగ్‌తో మోడీ భేటీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 8 దేశాల పర్యనటలో భాగంగా ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ రష్యాలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రష్యాలోని ఉఫాలో ఇరాన్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

అంతక ముందు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. దాదాపు 90 నిమిషాల పాటు పుతిన్‌తో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి అంగీకరించడంతో జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే.

తన తీర్మానానికి మద్దతిచ్చినందుకు, యోగా దినోత్సవాన్ని నిర్వహించినందుకు రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ యోగా చేయని సంగతి తెలిసిందే.

యోగా తనకు కష్టంగా కనిపిస్తుందనీ, అందువల్లే తాను దాన్ని అభ్యసించడానికి అస్సలు ప్రయత్నించలేదని ఆయన మనసులోని మాటను ప్రధాని మోడీకి తెలియజేసినట్లు సమాచారం.

 బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ

బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ


8 దేశాల పర్యనటలో భాగంగా ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ రష్యాలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బ్రిక్స్ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ


రష్యాలోని ఉఫాలో ఇరాన్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.

 జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ

జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టాక ఐదోసారి ఆయనతో భేటీ అయ్యాయని, రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనేందుకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ విలేకరులకు తెలిపారు.

 రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ

రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ


ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి అంగీకరించడంతో జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. తన తీర్మానానికి మద్దతిచ్చినందుకు, యోగా దినోత్సవాన్ని నిర్వహించినందుకు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi Wednesday took up with President Xi Jinping the issue of China putting on “technical hold” India’s move in the United Nations to question Pakistan on the release of 26/11 attack mastermind Zaki-ur Rehman Lakhvi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X