వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా అధ్యక్షుడి భారత పర్యటన వేళ.. :కాశ్మీర్ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ భారత పర్యటనకు బయలుదేరుతున్న వేళ.. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన జమ్మూ కాశ్మీర్ వివాదంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత తరచూ ఆ అంశం గురించి ప్రస్తావిస్తూ వస్తోన్న ఇమ్రాన్ ఖాన్.. భారత పర్యటనకు బయలుదేరి వెళ్లిన జిన్ పింగ్ దృష్టిని ఆకర్షించేలా కీలక ప్రకటనలు చేశారు. హాంగ్ కాంగ్ కొనసాగుతున్న ఉద్యమాలను రోజూ కవర్ పేజీలో ప్రచురిస్తోన్న విదేశీ మీడియా.. కాశ్మీర్ అంశాన్ని ఎందుకు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన వరుసగా ట్వీట్లను సంధించారు. హాంక్ కాంగ్ కంటే జమ్మూ కాశ్మీర్ లో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడి ప్రభుత్వం కాశ్మీరీల మానవ హక్కులను హరించి వేసిందని, ప్రజలు స్వేచ్ఛగా బయటికి తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. రాజకీయ నాయకులు సైతం నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. కాశ్మీర్ లో మానవ హక్కుల హననాన్ని ఎవరూ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. విదేశీ మీడియా కాశ్మీర్ అంశాన్ని పట్టించుకోవట్లేదని అన్నారు.

Ahead of Chinese President Xi Jinpings India visit, puzzled Imran Khan equates Hong Kong protests to Kashmir

రెండు నెలలుగా కాశ్మీర్ లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయిదని, వేలాది మంది కాశ్మీరీ ప్రజలు గృహ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం రాజకీయ నాయకత్వాన్ని అణచి వేసిందని విమర్శించారు. చిన్న పిల్లలు సైతం స్వేచ్ఛగా బయట తిరగలేని దుస్థితి ఏర్పడిందని, రోగులు ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. 30 ఏళ్లుగా తమ హక్కుల కోసం కాశ్మీరీలు ఎడతెగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారని, ఈ పోరాటంలో వందలాది మంది మరణించారని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. హాంక్ కాంగ్ లో కొనసాగుతున్న ఉద్యమాలపై రోజుల తరబడి కవరేజీ ఇస్తోన్న విదేశీ మీడియా.. కాశ్మీర్ అంశాన్ని ఎందుకు ప్రసారం చేయట్లేదని, కాశ్మీరీల బాధలను ప్రపంచానికి ఎందుకు తెలియజేయలేకపోతోందని ప్రశ్నించారు. ఈ విషయం తనకు ఓ పజిల్ లా మారిందని అన్నారు.

English summary
Pakistani Prime Minister Imran Khan raked up Kashmir yet again on Friday. In a series of tweets, Imran expressed his disappointment with the media coverage of Kashmir as compared to the protests in Hong Kong. He lamented that foreign media continues to cover Hong Kong protests but ignores the "dire human rights crisis" in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X