• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

|
Google Oneindia TeluguNews

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

 చాలాదేశాలు రీఓపెన్..

చాలాదేశాలు రీఓపెన్..

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గిపోతోండటంతో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి సిద్ధపడుతోన్నాయి. ఈ జాబితాలో ఉన్న బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇప్పటికే తమ ఆంక్షలను సడలించుకున్నాయి. పరిమితంగా విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదివరకు విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేశాయి. రెండు డోసుల వ్యాక్సిన్లను తీసుకున్న ప్రయాణికులను విమానాలు ఎక్కడానికి అనుమతి ఇస్తోన్నాయి.

 ఇక కెనడా కూడా..

ఇక కెనడా కూడా..

ఇదే జాబితాలో కెనడా కూడా చేరింది. భారత్‌కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ప్రారంభమైన తొలి రోజుల్లో విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. ఏప్రిల్‌లో విధించిన ఈ నిషేధం అయిదు నెలల పాటు కొనసాగింది. నిజానికి- కెనడా విధించిన ట్రావెల్ బ్యాన్ ఆగస్టు 21వ తేదీన ముగియాల్సి ఉండగా.. దాన్ని మరో నెలరోజుల వరకు పొడిగించింది. దాన్ని ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగించింది.

 ఢిల్లీ టు

ఢిల్లీ టు

ఈ గడువు ముగియడంతో ఈ నిషేధాన్ని మళ్లీ పొడిగించలేదు. రద్దు చేసింది. భారత్‌కు విమానాలను నడిపిస్తామని ఎయిర్ కెనడా ప్రకటించింది. తొలి విమానం ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ 42 ఇవ్వాళ దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుంది. నిషేధాన్ని ఎత్తేసిన నేపథ్యంలో ఇక ఎయిరిండియా కూడా తన విమానాలను పునరుద్ధరించడానికి సన్నద్ధమౌతోంది. ఢిల్లీ-వాంకూవర్, ఢిల్లీ-టోరంటో మధ్య నాన్‌స్టాప్ ఫ్లైట్లను నడిపించనున్నట్లు తెలిపింది.

ఈ నాలుగింట్లో ఏ ఒక్కటైనా

ఈ నాలుగింట్లో ఏ ఒక్కటైనా

ప్రయాణికులు మాత్రం కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఎయిర్ కెనడా తెలిపింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టులను అందజేయాల్సి ఉంటుందని, ఫుల్లీ వ్యాక్సినేటెడ్.. అంటే ప్రయాణికులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని సూచించింది. కెనడా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఫైజర్, కోవిషీల్డ్‌లల్లో ఏ ఒక్క వ్యాక్సిన్ అయినా రెండు డోసుల్లో తీసుకుని ఉండాలని పేర్కొంది. తమ వ్యాక్సిన్ డాక్యుమెంట్లను https://www.arrivecan-online.comలో సబ్మిట్ చేయాలని సూచించింది.

#Astrology : 7 Zodiac Signs Most Likely To Become Rich || Oneindia Telugu
అయిదు నెలల తరువాత..

అయిదు నెలల తరువాత..

భారత్‌లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి, అది సృష్టించిన కల్లోల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం భారత్‌తో వాయు సంబంధాలను తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రతి నెలా 21వ తేదీన దాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. చివరిసారిగా ప్రయాణ నిషేధాన్ని కిందటి నెల 21వ తేదీన పొడిగించింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిషేధ కాలం ఉంటుందని తెలిపింది. ఈ గడువు ముగియడంతో మళ్లీ నిషేధం జోలికి వెళ్లలేదు. దాన్ని రద్దు చేసింది. రాకపోకలకు అనుమతి ఇచ్చింది.

English summary
Air Canada said that it has resumed operations in India after a four-month long suspension of services in India in view of the Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X