వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గగనతలంలో విమానం: పైలట్‌కు కరోనా పాజిటివ్, సిబ్బంది అలర్ట్, ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీగా వెనక్కి..

|
Google Oneindia TeluguNews

వందేభారత్ మిషన్‌లో భాగంగా మాస్కో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్య నుంచే వెనక్కి పిలిపించారు. ఫైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీ విమానాన్ని రప్పించారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాస్కోకు ఎయిర్ ఇండియా ఏ-320 విమానం కూడా బయల్దేరింది.

ఫైలట్ సహా సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. విమానం ఉజ్బెకిస్తాన్ గగనతలంలో ఉండగా.. ఫైలట్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీంతో అధికారులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానాన్ని వెంటనే ఇండియా రావాలని ఆదేశించారు. దీంతో విమానం ఖాళీగానే ఢిల్లీ చేరుకుంది.

Air India jet returns to Delhi mid-flight after pilot tests positive..

విమానం ల్యాండయిన వెంటనే ఫైలట్ సహా సిబ్బందిని క్వారంటైన్‌లోకి తరలించారు. మాస్కోలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు మరో విమానం పంపిస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించడంతో మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్నవారిని మాత్రం 'వందేభారత్ మిషన్' ద్వారా తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ 4.0 సడలింపులతో దేశంలో విమానాలు మాత్రం తిరుగుతున్నాయి.

English summary
empty Moscow-bound Air India flight returned to Delhi when it emerged that its pilot had tested positive for the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X