వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏర్‌లైన్స్ ఉదారత, మధ్యప్రదేశ్ 5కోట్ల సాయం: నేపాల్‌కు దెబ్బపై దెబ్బ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ఖాట్మాండు: నేపాల్‌లో భూకంపం మృతుల సంఖ్య రెండువేల ఐదు వందలు దాటింది. ఇంకా శిథిలాల కింద మృతదేహాలు ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వేలాదిమంది గాయపడటంతో ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.

ప్రకంపనల భయంతో ప్రజలంతా రోడ్లమీదే గడుపుతున్నారు. భూకంప తాకిడికి ఖాట్మండు ఆనవాళ్లు కనుమరుగు అయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అయ్యాయి. బుల్‌డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు నేపాల్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత 25 గంటల్లో నేపాల్లో 30 సార్లు భూమి కంపించిందని అధికారులు చెప్పారు. మరో 72 గంటల పాటు నేపాల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఖాట్మాండులోని తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేపాల్‌కు రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.

భూకంపం

భూకంపం

నేపాల్‌లో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. శనివారం చోటుచేసుకున్న విధ్వంసం మరిచిపోకముందే ఆదివారం మరోసారి భారీస్థాయిలో భూమి కంపించింది. దీంతో నేపాల్‌లో పలుచోట్ల మరికొన్ని భవనాలు కూలినట్లు తెలుస్తోంది.

భూకంపం

భూకంపం

భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. నేపాల్‌లో సంభవించిన ఈ భూకంపం ప్రభావానికి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోను భూమి స్పల్పంగా కంపించింది.

భూకంపం

భూకంపం

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాల్లో స్వల్ప ప్రకపంనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారు.

భూకంపం

భూకంపం

భూకంపం నేపథ్యంలో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో వంటి విమానయాన సంస్థలు ఉచితంగా వస్తువులను, ఆహార పదార్థాలను తరలించేందుకు ముందుకు వచ్చాయి.

భూకంపం

భూకంపం

శనివారం నాడు దక్షిణభారత దేశంలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం

భూకంపం

ఏ క్షణం ఏమి జరుగుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భూకంపం ప్రభావంతో ప్రజలు తమ ఇళ్లలో ఉండాటానికి జంకుతున్నారు.

 భూకంపం

భూకంపం

భూకంప ధాటికి టిబెట్‌ కూడా అతలాకుతలమైంది. రాజధాని లాసాతోపాటు ఇతర ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి.

భూకంపం

భూకంపం

ఆదివారం మధ్యాహ్నం నాటికి 30 మృత దేహాలను వెలికి తీశారు. రోడ్లు టెలికమ్యూనికేషన్‌ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. టిబెట్ ‌- చైనా మధ్య రోడ్లను కొంతవరకు పునరుద్ధరించారు.

 భూకంపం

భూకంపం

చాలా ప్రాంతాల్లో మంచు ఉన్న కారణంగా సహాయ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. టిబెట్‌లో సహాయక చర్యల కోసం చైనా ప్రభుత్వం బృందాన్ని పంపింది. టిబెట్ ‌- నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఉన్న చాలా ఆలయాలు ధ్వసంమయ్యాయి.

English summary
Following the earthquake in Nepal, state-run Air India and budget carriers SpiceJet and IndiGo have decided to operate additional flights and carry relief material to the quake-hit country free of cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X