వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరస్సులోకి దూసుకెళ్లిన బోయింగ్ విమానం: ఏం జరిగిందంటే.?(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

సరస్సులోకి దూసుకెళ్లిన విమానం: ఏం జరిగిందంటే.?(వీడియో)

వెల్లింగ్టన్: ఓ ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే నుంచి జారిపడిన విమానం పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. అయితే, ఆ సరస్సు పెద్దగా లోతు లేకపోవడం ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

అదుపు తప్పిన విమానం

అదుపు తప్పిన విమానం

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 36మంది ప్రయాణికులు, 11మంది విమాన సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపు తప్పింది.

సరస్సులోకి దూసుకెళ్లిన విమానం

సరస్సులోకి దూసుకెళ్లిన విమానం

ఒక్కసారిగా రన్ వేపై నుంచి సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లింది. అయితే, సరస్సు లోతు ఎక్కువగా లేకపోవడంతో విమానం పూర్తిగా మునగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

పడవల్లో వచ్చి కాపాడారు

పడవల్లో వచ్చి కాపాడారు

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, సహాయక సిబ్బంది వెంటనే పడవలలో వెళ్లి ప్రయాణికులు, విమాన సిబ్బందిని కాపాడారు. కాగా, కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

విచారణకు ఆదేశం

కాగా, ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే, విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విమానం పపువాన్యూగినియా నుంచి బయల్దేరి ఇక్కడికి వచ్చింది. ఘటనపై న్యూగినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

English summary
The Boeing 737-800 was scheduled to stop in Chuuk on its way from Pohnpei to Port Moresby. The plane was reportedly carrying 36 passengers and 11 crew.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X