వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా డేటా రికార్డ్: సముద్రాన్ని ఢీకొట్టి, పేలిపోయింది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

జకర్తా: ఎయిర్‌ ఏషియా విమాన ప్రమాదం మిస్టరీ వీడింది! సముద్రాన్ని ఢీకొట్టడం వల్లే అది పేలిపోయిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత కీలకమైన ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(ఎఫ్‌డీఆర్‌)ను నౌకా సిబ్బంది సోమవారం వెలికి తీసిన విషయం తెలిసిందే.

ఇక బ్లాక్‌బాక్స్‌లో రెండో భాగమైన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ కూడా ఫ్లైట్‌ డేటా రికార్డర్‌కు 20 మీటర్ల దూరంలోనే పడి ఉంది. అయితే దానిని ఇంకా వెలికితీయలేదు. విమాన రెక్క శిథిలాల కింద ఎఫ్‌డీఆర్‌ను కనుగొన్నారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి.

ఒక్కసారిగా పీడనంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్న కారణంగా ఈ విమానం సముద్రతలాన్ని ఢీకొని పేలిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. 162 మంది ప్రయాణికులతో అదృశ్యమైన ఈ విమాన బ్లాక్‌బాక్స్‌లో కొంత భాగాన్ని సోమవారం వెలికితీశారు.

ఈ విమాన రెక్క భాగంలో శిథిలాల క్రింద ఉన్న బ్లాక్‌బాక్స్‌ను బయటకు తీసుకొచ్చారు. దీన్ని రెండు రోజుల క్రితమే గుర్తించినప్పటికీ వాతావరణ ప్రతికూలత కారణంగా బయటకు తీసుకురాలేకపోయారు. బ్లాక్‌బాక్స్‌లో మొత్తం రెండు భాగాలుంటాయి.

AirAsia QZ8501: Divers recover 'black box' flight recorder

తాజాగా ఫ్లయిట్ డేటా రికార్డును వెలికితీశామని అధికారులు తెలిపారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కూడా గుర్తించామని ఇది డేటా రికార్డకు అంటే కూడా 20 మీటర్ల దూరంలో ఉన్నందు దాన్ని ఇంకా వెలికితీయలేదని సెర్చ్ ఏజెన్సీ సమన్వయకర్త సుప్రియాడి వెల్లడించారు.

వాయిస్ డేటా రికార్డరు ద్వారా కొంత మేర ప్రమాద కారణాలను నిర్ధారించామని దీన్ని బట్టి పీడనలో వచ్చిన అత్యంత తీవ్రమైన ఆకస్మిక మార్పులు వల్లే ఎయిర్ ఏషియా విమానం సముద్ర తలాన్ని ఢీకొన్ని కూలిపోయినట్టుగా స్పష్టమవుతోందని వెల్లడించారు.

ఈ పీడన మార్పులకు ఒక్కసారికి విమాన కేబిన్‌లోనైందని దాన్ని సరిదిద్దేలోగానే ఫ్లయిట్ సముద్ర జలాలను ఢీకొని పేలిపోయిందని వెల్లడించారు. కచ్చితంగా తీవ్ర పీడనమే విమానం పేలిపోవడానికి కారణమైందని, దీని శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించిందని తెలిపారు.

అలాగే ఈ విమానం ఎడమ భాగం పూర్తిగా చిన్నాభిన్నం అయిందని, ఈ శబ్దాన్ని తాము విన్నామని అలాగే సముద్ర ఉపరితలం నుంచి పొగలు రావడాన్ని గమనించినట్టు జాలర్లు తెలిపాయన్నారు.

ఎయిర్ బస్ ఏ320-200 అనే విమానం తోక భాగం ముక్కలు ముక్కలు కావడం అలాగే ఫ్లయిట్ డేటా రికార్డరు ఓ కిలోమీటర్ ఆవల పడిపోవడాన్ని బట్టి చూస్తే కచ్చితంగా ఇది విస్ఫోటనానికి గురైందని నిర్ధారిస్తున్నామన్నారు. కాగా, ఇండోనేషియాలోని సురబయా నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఈ విమానం డిసెంబర్‌ 28న జావా సముద్రంలో కూలిపోవడంతో 162 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

English summary
AirAsia QZ8501: Divers recover 'black box' flight recorder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X