వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగిరే ట్యాక్సీల్లో గాలిలో ప్రయాణించవచ్చు

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్: అతి త్వరలో గాలిలో రివ్వున దూసుకెళ్లే స్వయం నియంత్రిత ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అందుకోసం ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ కసరత్తులు చేస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.

ఈ ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుతో పని చేసే అటానమస్ ఫ్లైయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ఎయిర్ బస్ ప్రకటించింది. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు.

Airbus to Build Autonomous Flying Taxis

ఇప్పటికే గూగుల్, ఉబర్, ఐబీఎం వంటి ప‌లు సంస్థలు స్వయం నియంత్రిత వాహనాల‌ను త‌యారు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డ్రైవర్ లెస్‌ కార్లను, బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎయిర్ బ‌స్ మరో అడుగు ముందుకేసి ఎగిరే ట్యాక్సీలకు రూపకల్పన చేస్తుంది.

వాటికి సిటీ ఎయిర్ బస్ అని నామకరణం చేశారు. ప్రయాణికులను, సరుకుల‌ను ఒకచోట నుంచి మరోచోటుకు చేరుస్తూ సిటీ ఎయిర్ బ‌స్ సేవలందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఇచ్చే కమాండ్‌తో ఈ సిటీ ఎయిర్ బ‌స్ తిరుగుతుంది. వచ్చే ఏడాది తొలి డిజైన్‌ను పరీక్షించనుంది. మ‌రో పదేళ్ల‌లో ఎగిరే సిటీ ఎయిర్‌బ‌స్‌లు పూర్తి స్థాయిలో ప్ర‌యాణికుల ముందుకు రానున్నాయి.

English summary
According to Airbus, A Flying Car Reality Is Just Around The Corner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X