వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెలిక్యాప్టర్, విమానం ఢీ: ముగ్గురి మృతి
వాడిసన్ :హెలిక్యాప్టర్, విమానం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ ఘటన వాడిసన్ సమీపంలో చోటు చేసుకొంది.
ప్రాణాలు కాపాడడమే తమ ప్రాధాన్యతగా పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్ , విమానం వైకోంబ్ ఎయిర్ పార్క్‌కు సంబంధించినవి. ప్రమాదానికి గురైన విమానం సెసినీ 152 .

స్థానిక కాలమాన ప్రకారంగా 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకొందని వైకోంబ్ విమాన అధికారులు ప్రకటించారు.
ఈ ఘటన స్థలంలో ఫైరింజన్లు అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన కారణంగా వాడిసన్ సమీపంలో రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.