వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూలుక్ : కొత్త రూపుతో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం...ట్రంప్ అందులో ప్రయాణిస్తారా..?

|
Google Oneindia TeluguNews

ఎయిర్ ఫోర్స్ వన్... ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన అమెరికా అధ్యక్షుడి విమానం. ఈ విమానం ఇప్పటి వరకు ఎంతో మంది అమెరికా అధ్యక్షులను తమ అధికార పర్యటనలకు తీసుకెళ్లింది. దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించింది. నీలం, తెలుపు కలర్స్‌తో ఎంతో ఆహ్లాదకరంగా కంటికి కనిపించే ఈ భారీ విహంగం త్వరలో రంగులు మార్చుకొని నయా లుక్‌తో దర్శనమివ్వబోతోంది. ఇదే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్‌లాండ్‌ వేదికగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రెండు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల స్థానంలో కొంత రంగులతో రెండు కొత్త విమానాలు రానున్నాయి. కొత్తగా రానున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలు ఇకపై ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో కనిపిస్తాయని ట్రంప్ వివరించారు.

అంతేకాదు కొత్తగా వచ్చే ఎయిర్ ఫోర్స్ విమానాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉంటాయని ట్రంప్ వెల్లడించారు.అయితే ఆ విమానాల్లో తను ప్రయాణించే అవకాశం ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేనని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి అమెరికా రక్షణదళంలోకి చేరేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యేవారైనా ఈ కొత్త విమానాల్లో ప్రయాణించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. కొత్త విమానాల కొనుగోలు విషయంలో వైట్‌హౌజ్ వర్గాలు కొన్ని నెలలుగా చర్చలు జరిపి చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నిర్ణయానికి వచ్చాయి. బోయింగ్ సంస్థతో 3.9 బిలియన్ డాలర్లకు రెండు కొత్త ఎయిర్ ఫోర్స్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

 Airforce-1 to have new look, says Trump

అంతకుముందు రెండు కొత్త విమానాల కొనుగోలుపై ట్రంప్ కాస్త కఠినంగా వ్యవహించారు. రెండు విమానాలకు అంత ఖర్చు చేయడమేంటి అంటూ మందలించారు కూడా. అంతేకాదు 1.4 బిలియన్ డాలర్లు టాక్స్ పేయర్స్ డబ్బు ఆదా అవుతుందని వ్యాఖ్యానించారు. అదే 2016 సంవత్సరంలో ట్రంప్‌ స్వరంలో కొంత మార్పు వచ్చింది. అప్పుడు రెండు విమానాల ఖర్చుపై విరుచుకుపడ్డ ట్రంప్... తాజా ఇంటర్వ్యూలో రెండు విమానాలకు 4 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు బోయింగ్ విమాన సంస్థపై ట్రంప్ కన్నెర్ర చేయకముందే... కొంతవరకు తామే తగ్గి కొత్త విమానాలను అందించాల్సిందిగా వైట్ హౌజ్ వర్గాలు బోయింగ్ సంస్థకు సంకేతాలు పంపాయి.

ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం తొలిసారిగా 1990లో గాల్లోకి ఎగిరింది. సాంకేతికంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణించినా సరే.... దాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అనే పిలుస్తారు. అందులో అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేవరకు దాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ కిందే లెక్కకడతారు. కొత్తగా ఆర్డర్ ఇచ్చిన విమానాలు 2024కల్లా అమెరికా రక్షణదళంలో చేరుతాయని అంచనా వేస్తున్నారు. అయితే అప్పటి వరకు ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉంటారన్న గ్యారెంటీ లేదు. అందుకే 2021 కల్లా అవి తయారు కావాలని కఠిన ఆదేశాలు ఇచ్చారు ట్రంప్.

English summary
Very soon People will be witnessing new Airforce one which is the official plane of American President.President Trump said that two new Airforce one Planes will be replaced by the present ones with new colors. The current planes are with light blue and white colours. The new jets will be painted red, white and blue explained Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X