వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన విమానం: బ్రెజిల్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్లతోపాటు 81మంది

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత దారుణమైన ప్రమాదం సంభవించింది. బ్రెజిల్ చాపికోయన్స్ ఫుట్ బాల్ టీంను తీసుకువెళుతున్న విమానం కొలంబియాలో కుప్పకలింది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. ప్రమాద సమయంలో విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.

ఇంధన కొరత కారణంగానే విమానం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 10.15గంటల సమయంలో(స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. రియోనిగ్రోలోని జాస్‌ మరియా కార్డోవ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరింది.

Airplane carrying Brazilian pro football players crashes in Colombia

కొలంబియాలో ఇది రెండో అతి పెద్ద విమానాశ్రయం. కోపా సుదామెరికన్‌ ఫైనల్స్‌లో భాగంగా బుధవారం అట్లెటికో నసియోనల్‌తో తలపడేందుకు బ్రెజిల్‌ చాపికోయిన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు బయల్దేరింది. కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగింది.

ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 81మందిలో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. కాగా, మిగితా వారంతా ప్రమాద ఘటనలో ప్రాణాలు వదిలారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పర్యటనకు బయల్దేరిన జట్టు సభ్యులు.. ఈ ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలిచివేసింది.

English summary
A plane carrying Brazilian pro football players has crashed in Colombia. A plane that left Bolivia with 72 passengers crashed on its path to the Medellin international airport. Aviation authorities said there appear to be survivors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X