వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు భయపడే గగనతలంపై నిషేధం..! ఒప్పుకున్న పాక్.. జెట్ ఫైటర్స్‌ను తొలగించాలని డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఇండియన్ ఎయిన్‌ఫోర్స్ తన ఎయిర్ బేస్‌లలో మోహరించిన జెట్ ఫైటర్స్‌ను వెనక్కి పంపించే వరకు విమానాల ప్రయాణాల కోసం పాకిస్థాన్ గగనతలాన్ని తెరబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పాకిస్థాన్ ఏవియోషన్ సెక్రటరీ షారుఖ్ నుస్రత్ పార్లమెంటరీ కమిటికి స్ఫష్టం చేశాడు.కాగా గత ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి పరిణామాల అనంతరం బాలాకోట్ క్యాంప్‌పై భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే..అప్పటి నుండి పాకిస్థాన్ తన గగనతలం పై విమానల ప్రయాణాన్ని నిషేధించింది.

అయితే తాజాగా పాకిస్థాన్ తన గగనతలాన్ని జులై 12 వరకు మూసివేస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే నేటితో గడువు ముగియడంతో భారత అధికారులు పాకిస్థాన్‌ను ఏవియోషన్ అధికారులను కలిసి పాక్ గగనతలం పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ కోరింది. దీంతో ఇప్పటి వరకు భారత్ సుహృధ్బావా వాతవరణాన్ని కోరుకున్న పాకిస్థాన్ ఒక్కసారిగా తన వ్యతిరేకతను చాటింది. ఈనేపథ్యంలోనే భారత ఎయిర్ ఫోర్స్ ఆయా ఎయిర్ బేస్‌ల వద్ద మోహరించిన జెట్ ఫైటర్స్‌ను తొలగించేవరకు పాక్ గగనతలం పై నిషేధాన్ని ఎత్తివేయమని స్పష్టం చేసింది.

airspace will not open until removes fighter jets from forward IAF airbases:pakistan

కాగా ప్రధానమంత్రి మోడీ గత నెల షాంఘైలోని బిష్కేక్‌లో జరిగే ఎస్‌సీఓ సమావేశాలకు వెళ్లేందుకు పాక్ గగనతలం నుండి మోడీ ప్రత్యేక విమానాలు ప్రయాణించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే మోడీ మాత్రం పాక్ గగనతలాన్ని ఉపయోగించుకోకుండా ఇరాన్ మీదుగా షాంఘైలోని ఎస్‌సీవో సమావేశానికి హజరయ్యారు. పాక్ గగనతలం మూసి వేయడంతో మలేషియా, థాయ్‌లాండ్‌ నుండి నడిచే విమానాలు చాల దూరం ప్రయాణించి ఇండియాకు చేరుకోవాల్సి వస్తుంది.

English summary
pakistan has told India that it will not open its airspace for commercial flights until New Delhi removes its fighter jets from forward IAF airbases, Pakistan's Aviation Secretary Shahrukh Nusrat has informed a Parliamentary committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X