వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ యువరాజు సల్మాన్‌తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ వైఖరిపై డిస్కస్

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌పై దాయాది పాకిస్థాన్ వైఖరిని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతుంది. వివిధ వేదికలపై పాకిస్థాన్ కపటనీతి ఏంటో బహిర్గతం చేస్తోంది. ఇటీవల అమెరికాలో కూడా అగ్రరాజ్య అధినేత ట్రంప్ మద్దతును ప్రధాని నరేంద్ర మోడీ కూడగట్టారు. దీంతో భారత్‌ను ఏకాకి చేయాలనే పాకిస్థాన్ పాచిక పారలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం సపోర్ట్ తీసుకునేందుకు స్వయంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. ఆయన అలా పర్యటన ముగించుకొని వచ్చారో లేదో.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు.

కశ్మీర్‌ అంబాసిడర్‌గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్‌ అంబాసిడర్‌గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్

సౌదీ అరేబియాలో ఎన్ఎస్ఏ ధోవల్ పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పటయ్యాక కశ్మీర్‌లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మోడీ 2.0 ప్రభుత్వంలో ధోవల్ కీలక అంశాలపై ముఖ్యభూమిక పోషిస్తున్నారు. తాజాగా ఆయన సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ధోవల్ సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలపాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకొచ్చాయి. కానీకశ్మీర్‌పై పాకిస్థాన్ అనుసరిస్తోన్న వైఖరిపైనే ప్రధాన డిస్కషన్ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ajit doval in saudi arabia: met saudi crown prince, discuss kashmir issue

కశ్మీర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సల్మాన్ స్వాగతించినట్టు తెలిసింది. దీంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై సల్మాన్, ధోవల్ డిస్కస్ చేశారు. వివిధ అంశాలపై ఇరు దేశాలు పరస్పర సహకారం చేసుకునేందుకు ధోవల్ పర్యటన దోహదపడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తర్వాత దోవల్, ముస్సాద్ బిన్ మహ్మద్ అల్ అబియన్‌తో జాతీయ భద్రత, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. యునైటెడ్ అరంబ్ ఎమిరేట్స్‌కు చెందిన మరికొందరు ముఖ్యనేతలను ఇవాళ ధోవల్ కలుసుకునే అవకాశం ఉంది.

English summary
National Security Advisor Ajit Doval met with Saudi Crown Prince Mohammad Bin Salman to counter Pakistan's version on Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X