వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ajit Doval:అమెరికాలో ప్రధాని మోదీ ఆయుధం..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక నేతలను కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. తాజాగా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.వ్యూహాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు చర్చించారు. ఇజ్రాయిల్, ఈజిప్ట్‌తో పాటు పలు మిడిల్ ఈస్ట్ దేశాల్లో పర్యటించి అమెరికాకు దోవల్ చేరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పలు సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఇటు భారత్ అటు అమెరికా దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఈ విషయంలో ఒకొరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారని సమావేశం అనంతరం యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పై ఈ సమావేశంలో తాను అజిత్ దోవల్‌తో చర్చించినట్లు బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇటు అంతర్జాతీయ అటు ప్రాంతీయ సమస్యలపై ఇరు దేశాల మధ్య సహృదభావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక భారత్‌ నుంచి పలు అధికారులతో అమెరికా చేరుకున్న దోవల్... ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్‌తో కూడా భేటీ అయ్యారు.

Ajit Doval meets US secretary of state Antony blinken,Discuss key issues on global and regional issues
ఈ ఇద్దరి సమావేశం ప్రధానంగా టెక్నాలజీ అంశం పైనే జరిగింది. గతేడాది మే నెలలో టోక్యో వేదికగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య జరిగిన మాటలు లేదా చర్చలు కార్యరూపం దాల్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. కొన్ని సున్నితమైన అంశాలపై భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. భారత్‌లో స్టార్టప్ వ్యవస్థకు అమెరికా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సులివన్ తెలిపారు.
English summary
National security Advisor Ajit Doval meets US secretary of state Antony Blinken and discusses few key issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X