వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోయిన అల్‌ఖైదా: జైల్లోకి చొరబడి 200 మందిని తీసుకెళ్లారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

యెమెన్: యెమన్‌లో ఓ జైలులోకి జొరబడ్డ అల్‌ఖైదా ఉగ్రవాదులు జైల్లో ఉన్న దాదాపు 200 మంది ఖైదీలను విడిపించుకుని వెళ్లారు. ఖైదీల్లో అల్‌ఖైదా నాయకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు ఖైదీలను విడిపించుకుపోయిన సంఘటన కోస్టల్ యెమినిలో గురువారం ఉదయం జరిగింది.

జైలు నుండి తప్పించుకుపోయిన వారిలో అలై ఖైదాకు చెందిన ముఖ్యమైన ఖలీద్ బతార్ఫీ ఉన్నట్లు అధికారులు చెప్పారు. పదుల సంఖ్యలో వచ్చిన అలై ఖైదా ఉగ్రవాదులు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు.

Al-Qaeda fighters free nearly 200 from Yemeni prison

వారు స్వాధీనం చేసుకున్న దానిలో కేంద్ర కారాగారం కూడా ఉంది. కేంద్ర కారాగారం, సెంట్రల్ బ్యాంక్, రేడియో స్టేషన్ తదితరాలును వారు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయం తెలియడంతో ప్రభుత్వ సాయుద బలగాలు అక్కడకు వచ్చాయి.

ఇరువర్గాల మధ్య పోరు జరిగింది. ఈ సమయంలో చాలామంది ఉగ్రవాదులు అక్కడి నుండి పలాయనం చిత్తగించారని తెలుస్తోంది. కాగా, గత నెల వందలాది మంది ఖైదీలు ఆడెన్‌లోని మన్సూరా కేంద్ర కారాగారం నుండి తప్పించుకుపోయారు.

English summary
Al-Qaeda fighters free nearly 200 from Yemeni prison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X