వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీహాదీలకు అల్‌ఖైదా నేత జవహరీ పిలుపు: ఆ దేశాలను నాశనం చేయండి

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మృతి తర్వాత మళ్లీ ఆస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆల్‌ఖైదీ నేత అయమన్ అల్ జవహరీ మరోసారి రక్తపాతం సృష్టించేందుకు ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. గత 18 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న జవహరీ ... సెప్టెంబర్ 9/11 దాడులు జరిగి 18 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అమెరికా, యూరోప్, ఇజ్రాయిల్, రష్యాలే లక్ష్యంగా దాడులు చేయాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు. ఓ వీడియో ద్వారా ఆయన ఈ సందేశంను విడుదల చేశాడు.

కశ్మీర్‌పై జోక్యం చేసుకొండి.. అమెరికా విదేశాంగ మంత్రికి నేతల లేఖ, నిర్బంధం సరికాదని కామెంట్కశ్మీర్‌పై జోక్యం చేసుకొండి.. అమెరికా విదేశాంగ మంత్రికి నేతల లేఖ, నిర్బంధం సరికాదని కామెంట్

జీహాదీల్లో కొందరు నమ్మకద్రోహులున్నారు

జవహరీ ప్రసంగం చేసిన వీడియో బయటకు పొక్కకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు అడ్డుకున్నాయి. జీహాద్‌లో కొందరు నమ్మకద్రోహులు ఉన్నారని చెప్పిన జవహరీ... జైలులో ఉన్న జీహాదీలు మంచివారిగా మారి 9/11 దాడుల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పడాన్ని జవహరీ ఖండించారు. ఇదిలా ఉంటే అల్‌ఖైదా ఉగ్రవాదులు 2001లో విమానాలను హైజాక్ చేసి దాడులు నిర్వహించారు. ఇందులో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఒక విమానంతో పెంటగాన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇక నాలుగో విమానం పెన్సిల్వేనియాలో క్రాష్ అయ్యింది.

అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో జవహరీ

అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో జవహరీ

ఐసిస్ అగ్రనేత అబు బకర్, అల్‌ఖైదా నేత జవహరీలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. వారి తలపై 25 మిలియన్ అమెరికన్ డాలర్ల బహుమానం ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఈజిప్టులో పుట్టిన జవహరీకి 67 ఏళ్లు. ఒసామా బిన్ లాడెన్ మృతి తర్వాత అల్ ఖైదా పగ్గాలు జవహరీ చేపట్టారు. అంతేకాదు జవహరీ కొన్ని మారుపేర్లతో బయట ప్రపంచంలో తిరుగుతున్నట్లు సమాచారం. అయితే జవహరీ ఎక్కడుంటాడో ఇప్పటి వరకు జాడలేదు. కానీ అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లోనే ఉంటున్నట్లు అమెరికా నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐసిస్ పై ప్రపంచ దేశాల దృష్టి ఉన్నప్పటికీ ... ఈ గ్యాప్‌లో అల్‌ ఖైదా కూడా ఏదైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

హెచ్చరిక

హెచ్చరిక

అల్‌ఖైదా నిశబ్దం వెనక పెద్ద కుట్రే ఉంది: నిఘావర్గాలు
సాధారణంగా అల్‌ఖైదా ఒక వ్యూహం రచించిందంటే దాని అమలు చేసేందుకు ఎంతో సమయం తీసుకుంటుంది. ఈ సమయంలోనే పక్కా ప్రణాళికను అమలు చేసేందుకు శిక్షణ నుంచి చివరి నిమిషం వరకు అన్నీ చాలా దగ్గరగా మానిటర్ చేస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అల్‌ఖైదా నిశబ్దంగా ఉందంటే దాని వెనక గేమ్‌ ప్లాన్ రచిస్తోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.ఇక ప్రపంచ వ్యాప్తంగా అల్‌ఖైదా కోసం, జవహరీ నాయకత్వంలో పనిచేసేందుకు 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.

English summary
He has managed to evade authorities for more than 18 years, but Al Qaeda leader Ayman al-Zawahri is still using his platform to call for bloodshed from the shadows.To mark the 18th anniversary of the September 11 attacks, the terror leader called on Muslims to attack U.S., European, Israeli and Russian targets in a speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X