వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటికన్ సిటిని టార్గెట్ చేసుకున్న ఆల్ ఖైదా !

|
Google Oneindia TeluguNews

రోమ్: అల్ ఖైదా ఉగ్రవాదులు వాటికన్ సిటిని లక్ష్యంగా చేసుకున్నారని వెలుగు చూసింది. ఇటలీ పోలీసులు ఇప్పటికే 18 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వారిలో ఇస్లామ్ మతానికి చెందిన ఒక అధ్యాత్మిక గురువు ఉన్నాడని ఇటలీ పోలీసు అధికారులు తెలిపారు.

క్రైస్తవులకు పరమ పవిత్రమైన ప్రార్థనా మందిరం వాటికన్ సిటి. క్రైస్తవులు ఒక్క సారైనా వాటికన్ సిటిని చూడాలని ఆశపడుతారు. అలాంటి ప్రార్థనా మందిరం మీద ఆల్ ఖైదా కన్ను పడింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ లో దాడులుకు పాల్పడింది.

పోలీసు అధికారులు ఇటలి మొత్తం గాలించి శుక్రవారం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు నివాసం ఉంటున్నచోట కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, పత్రాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

 al Qaeda Links, Italian police on Friday arrested 18 people

పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్న18 మందిని కోర్టు ముందు హాజరు పరిచి తరువాత అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ముందు జాగ్రత చర్యగా రోమ్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఇంకా సోదాలు జరుగుతున్నాయి.

పోలీసుల అదుపులో ఉన్న 18 మందికి ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని కాగ్గియారీ చీఫ్ ప్రాసిక్యూటర్ మౌరో మురా తెలిపారు. వీరు ఇటలిలో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు చెయ్యాలని ప్లాన్ చేశారని వెలుగు చూసింది. ఇప్పటికే చాలా మంది దేశం విడిచి పారిపోయారని తెలిసిందని, వారి వివరాలు సేకరిస్తున్నామని మౌరో మురా అన్నారు.

English summary
A terror cell that plotted to bomb the Vatican and included Osama bin Laden’s bodyguards among its members has been smashed by Italian counter-terror police, prosecutors have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X