వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో దాడులు చేసేందుకు అల్‌ఖైదా సిద్ధమవుతోంది: ఐక్యరాజ్యసమితి

|
Google Oneindia TeluguNews

భారత భూభాగంపై అల్‌ఖైదా దాడులకు తెగబడేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందా...? భారత్‌లో తన అనుబంధ సంస్థ పనిచేస్తోందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడిచేసింది. భారత్‌లో ఏక్షణమైన అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులకు తెగబడేందుకు సిద్ధంగా ఉన్నారని..భారత్‌లో అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఈ కుట్రలకు పాల్పడుతోందని యూఎన్ వెల్లడించింది. భారత్‌లో భద్రత పటిష్టంగా ఉన్నందున అది అంత ఈజీకూడా కాదని అల్‌ఖైదా భావిస్తున్నట్లు సమాచారం. అయితే అవకాశం కోసం ఎదురుచూస్తోందని చెప్పిన ఐక్యరాజ్యసమితి ...అవకాశం లభిస్తే మాత్రం భారీ దాడులు చేసే అవకాశముందని పేర్కొంది.

సాధారణంగా అఫ్ఘానిస్తాన్‌లో అల్‌ఖైదా బలంగా ఉందని అక్కడ దాదాపు కొన్ని వందల మంది ఉగ్రవాదులుగా ఉన్నారని తెలిపింది. వారంతా లగ్మన్, పాక్‌టికా, కాందహార్, గజని, జబుల్ ప్రావిన్స్‌లో తిష్ట వేసి ఉన్నట్లు యూఎన్ వెల్లడించింది. దక్షిణ ఆసియా ప్రాంతాల్లో అల్‌ఖైదా ప్రభావం ఉందని చెప్పిన యూఎన్... తాలిబన్లతో టచ్‌లోనే ఉంటూ... ఆసియా ప్రాంతాల్లోని స్థానికులతో ఈ ఉగ్రవాదులు కలిసిపోతున్నారని చెప్పింది. స్థానిక పరిసరాలకు అలవాటు పడి, స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటాలు చేసినట్లుగా నటించి ఆ తర్వాత దాడులు చేస్తారని యూఎన్ వివరించింది.

Al Qaeda preparing plans to attack India, reveals UN report

ప్రస్తుతం ఐసిస్ నుంచి ముప్పు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం అల్ ఖైదా ఉగ్రవాద సంస్థనుంచి పేట్రేగిపోయే అవకాశం ఉందని యూఎన్ అంచనా వేస్తోంది. అల్‌ఖైదా ముఖ్యనాయకులు జవహరీ, ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌లు అఫ్ఘానిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తిష్ట వేసి భారత్‌లో దాడులకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిగతా నాయకులు మరింత భద్రత ఉన్న ప్రాంతాల్లో తిష్ట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 20వేల నుంచి 30వేల వరకు ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియా దేశాల్లో ఉన్నట్లు నివేదిక తెలిపింది.

యూరోప్‌లో దాడులకు ప్రయత్నించి విఫలమైన వారిని విచారించగా అందులో చాలామంది అఫ్ఘానిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఐసిల్ ఉగ్రవాదులుగా తేలినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. అఫ్ఘానిస్తాన్‌ దేశంలో పాటు యూరోప్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఐసిల్ కదలికలు కనిపిస్తున్నాయని యూఎన్ తెలిపింది. ఇదే ఐసిల్ కశ్మీర్‌లో దాడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోందని అయితే ఎలాంటి దాడులు చేస్తుందో చెప్పలేమని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

ఐసిల్ ఉగ్రవాద సంస్థలో ఇప్పటికే స్లీపర్ సెల్స్ భారీ స్థాయిలో దాడులు చేశారని హెచ్చరించింన యూఎన్, ఈద్ సందర్భంగా కొందరు ఐసిల్ ఉగ్రవాదులు రెచ్చిపోయారని యూఎన్ తెలిపింది. ఐసిల్‌లో ఇప్పటికైతే 3500 నుంచి 4వేల వరకు సభ్యులున్నారని తెలిపిన ఐక్యరాజ్య సమితి,ఇందులో 600 నుంచి 1000 వరకు ఉగ్రవాదులు ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో ఉన్నట్లు సమాచారం. దీనికి అబు సయ్యద్ బజౌరి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మధ్యాసియా ప్రాంతాలకు పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని యూఎన్ హెచ్చరించింది.

English summary
Al Qaeda in the Indian Subcontinent (AQIS), the terror group’s newest affiliate, is “ideologically inclined” to carry out attacks inside India but its capability is believed to be low and is relatively isolated owing to increased security measures in the region, according to a UN report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X