వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్ ఖైదా యెమన్ నేత ఖాసీం అల్ రేమి హతం, ఉగ్రదాక నిరోధక చర్యల్లో భాగమే: డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా యెమన్‌కు చెందిన అల్ ఖైయిదా నేత ఖాసీం అల్-రేమిని హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యెమన్‌లో రేమి హింసకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పౌరులతోపాటు అమెరికా దళాలపై కూడా దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రేమితో ద్వీపకల్పంలో అశాంతి నెలకొందని వివరించారు. అందుకోసమే మట్టుబెట్టాల్సి వచ్చిందని తెలియజేశారు.

ముప్పు అని..

ముప్పు అని..


జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన రేమిని హతమార్చారని ట్రంప్ తెలిపారు. రేమి మృతితో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అయితే రేమిని అమెరికా సేనలు ఎప్పుడూ మట్టుబెట్టాయనే అంశంపై మాత్రం ట్రంప్ స్పష్టత నివ్వలేదు.

దాడి-ప్రతీకార దాడి

దాడి-ప్రతీకార దాడి


ప్లోరిడాలోని అమెరికా నావికదళం ఎయర్ స్టేషన్‌పై డిసెంబర్ 6వ తేదీన యెమన్‌కు చెందిన అల్ ఖైదా దాడి చేసినట్టు ప్రకటించింది. కాల్పుల్లో సౌదీ వైమానిక దళ అధికారి ఒకరు, ముగ్గురు నావికులు చనిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత యెమన్ అల్ ఖైదా ప్రమాదకరమని అమెరికా భావించింది. దానిని ఎలాగైనా నిర్మూలించాలని భావించింది. ఆ మేరకు మట్టుబెట్టామని అమెరికా అధినేత ట్రంప్ ప్రకటించారు.

ఇలా ఆవిర్భావం..

ఇలా ఆవిర్భావం..

యెమన్‌లో సౌదీ మద్దతుగల ప్రభుత్వం-షియా తిరుగుబాటుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోండగా.. ఆల్ ఖైదా పుట్టుకొచ్చింది. మెల్లగా బలపడి.. దాడులు చేయడం ప్రారంభించింది. దాడులు చేస్తూ ప్రజలను తెగబడి భయకంపితులను చేస్తోంది.

8 మందికి గాయాలు

8 మందికి గాయాలు

అమెరికా సేనల దాడిలో ఉగ్రవాద సంస్థకు చెందిన ఎనిమిది మంది గాయపడ్డారు. దాడిలో రాయల్ సౌదీ వైమానిక దళంలో పనిచేసేందుకు శిక్షణ పొందుతున్న అల్హామ్రానీ చనిపోయారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ఐబీ గుర్తించింది.

English summary
US President Donald Trump said on Thursday the United States killed al Qaeda in Arabian Peninsula eader Qassim al-Raymi in a counterterrorism operation in Yemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X