వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతకాని దద్దమ్మలు: ఆల్ ఖైదా మీద ఐఎస్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

బీరుట్/సిరియా: ప్యారిస్, మాలిలో జరిగిన ఉగ్రదాడులు తరువాత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థల మద్య అస్సలు సొసగడం లేదని మరో సారి వెలుగు చూసింది. మీకు వ్యూహాలు రచించడం రాదంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఈ రెండు ఉగ్రవాద సంస్థల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఇప్పటికీ ఉందని బహిరంగం అయ్యింది. ఆఫ్రికాలోని మాలిలోని ఓ స్టార్ హోటల్ లో చోరబడిన ఆల్ ఖైదా కు చెందిన అనుబంధ సంస్థ ఉగ్రవాదులు 18 మందిని హత్య చేసిన విషయం తెలిసిందే.

తరువాత భద్రతా దళాలు జరిపిన దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారు. అదే విదంగా గత శుక్రవారం ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 129 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

al-Qaida VS Islamic State in Social Media

ఈ సందర్బంలో ఆల్ ఖైదా-ఐఎస్ఐఎస్ మద్దతుదారులు ఆన్ లైన్ లో పరస్పర విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. తాను సిరియాలో ఆల్ ఖైదా తరపున ఫైటర్ గా పని చేస్తున్నానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.

ఐఎస్ఐఎస్ వ్యూహాలను తప్పుబట్టాడు. అల్లాహు ఆలం పేరిట ఉన్న మరో యూజర్ మాలి తరహా దాడులు చెయ్యడం ఐఎస్ఐఎస్ కు చేతకాదని, అందుకే ప్యారిస్ లో 129 మందిని లేపేశామని ఐఎస్ఐఎస్ ఫైటర్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

మొదట ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ కలిసి పని చేశాయి. అయితే ఇద్దరి మద్య వ్యూహాలు అమలు చేసే విషయంలో విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఒకరిని చూస్తే ఒకరికి కాదని, రెండు గ్రూపుల మద్య వైర్యం పెరిగిపోయిందని మరో సారి వెలుగు చూసింది.

English summary
The Islamic State has since emerged as the most dynamic, popular force among radicalized Muslims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X