వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొమాలియా ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్లు: పది మంది మృతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

మొగదిష్: సోమాలియా రాజధాని మొగదీష్‌లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. మొగదీష్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపాన ఈ బాంబు పేలుళ్లు సంభవించడం పెను కలకలం రేపింది. కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ బాంబు పేలుడు ఘటనలో 8 మంది పౌరులు మృతి చెందినట్లుగా వెల్లడించారు. బాంబు పేలుడు ఘటనతో నగరం మొత్తం తెల్లని పొగతో కప్పబడింది. రెండు గ్రూపులుగా మొగదీష్‌‌కు చేరుకున్న ఉగ్రవాదులు తొలుత విమానాశ్రయ సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడగా, ఆ తర్వాత మరికొంద మంది ఉగ్రవాదులు సోమాలియా గవర్నమెంట్ ఫోర్సెస్ చెక్‌పోస్ట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు.

Al-Shabab bombs target African Union troops in Somalia

పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదులను, సైనికులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఆల్ షెబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

విమానాశ్రయం వద్ద రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఈ బాంబు పేలుళ్లపై ఆఫ్రియా యూనియన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తమ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.

ఈ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
Two vehicles packed with explosives were detonated in Somalia's capital Mogadishu near a base for African Union troops next to the main airport, according to local witnesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X