వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు చైనా ఎవరెస్ట్ సెగ: సొరంగ మార్గం ద్వారా టిబెట్‌-నేపాల్‌కు రైలు మార్గం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత్‌కు పక్కలో బళ్లెంలా తయారైన చైనా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టిబెట్ - నేపాల్ మధ్య 540 కిలోమీటర్ల మేర హై‌స్పీడ్ రైలు నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఈ రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టు గుండా వెళ్లనుంది.

వివరాలిలా ఉన్నాయి. చైనా గతంలో నేపాల్‌తో వ్యాపారం బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు క్వింగ్హై - లాసా మార్గంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. ఇప్పుడు ఈ రైలు మార్గానికి ఇరు దేశాలు శ్రీకారం చుట్టినట్లు అ దేశ రైల్వే రంగం నిపుణుడు వాంగక మెంగ్ష్ స్థానిక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చైనా నుంచి నేపాల్‌కు ఎవరెస్ట్ శిఖరం మీదుగా రైలు మార్గం వేయాలని నిర్ణయించినట్లు, ఈ రైలు మార్గాన్ని 2020 కల్లా పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చును మాత్రం బయట పెట్టలేదు.

Alarm bells for India? China plans to build rail link with Nepal through Mount Everest

క్వింగ్హై - టిబెట్ మధ్య దూరం 1,956 కిలోమీటర్లు. ఈ మార్గంలో టిబెట్ రాజధాని లిసా నుంచి ఇప్పటికే చైనాలోని కొన్ని ప్రాంతాలకు రైలు మార్గం ఉందన్నారు. టిబెట్ - నేపాల్ మధ్య ప్రాజెక్టు మొదలైతే ఇంజనీర్లు కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు.

టిబెట్ ప్రాంతంలోని మౌంట్ ఎవరెస్ట్ కొమలంగ్మా శిఖరం అడుగు భాగాన సొరంగం తవ్వనున్నట్లు తెలిపారు. భారీ పొడవైన సొరంగం నిర్మించవలసి ఉంటుందన్నారు. పర్వత ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో రైలు వేగం 120 కిలోమీటర్లు మించకూడదని వాంగక మెంగ్ష్ పేర్కొన్నారు.

గత నెలలో నేపాల్ ప్రెసిడెంట్ రామ్ బారన్ యాదవ్ టిబెట్ సందర్శనలో భాగంగా టిబెట్ అటానమస్ రీజియన్ ఛైర్మన్ లోసాంగ్ జమ్కాన్ ఆయనతో మాట్లాడుతూ చైనా త్వరలో టిబెట్ రాజధాని లిసా నుంచి నేపాల్ బోర్డర్‌కు సమీపాన ఉన్న కెర్ముగ్‌కు రైల్వే రైలు నిర్మించనున్నట్లు తెలిపారు.

దీంతో పాటు టిబెట్ రైల్వే నెట్‌వర్క్‌ను నేపాల్ చైనాలతో పాటు భూటాన్, ఇండియాకు కూడా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన తెలిపారు. చైనా ఇప్పుడు టిబెట్ నుంచి నేపాల్‌కు రైలు మార్గాన్ని విస్తరించడానికి గల ప్రధాన కారణం ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ప్రవేశించేందుకేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
China plans to build a 540-kilometre strategic high-speed rail link between Tibet and Nepal passing through a tunnel under Mt Everest, a move that could raise alarm in India about the Communist giant's growing influence in its neighbourhood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X