వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారీ భూకంపం: 7.8 తీవ్రత.. అలస్కా తీరంలో సునామీ హెచ్చరికలు జారీ.. హైటెన్షన్..

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. అలస్కా దక్షిణ తీరంలోని చిగ్నిక్ సిటీకి 98 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్ర అడుగున 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో సునామీ తలెత్తనుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.12 కు భూకంపం సంభవించగా, మరో గంటన్నరలో సునామీ తీరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అమెరికా జియాలజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) కీలక ప్రకటన విడుదల చేసింది. అలస్కా తీరం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని ప్రజల్ని అప్రమత్తం చేశారు.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వివరణ ప్రకారం భూకంపం తరువాత సంభవించబోయే సునామీ దక్షిణ అలస్కాను ప్రభావితం చేస్తుందని, పసిఫిక్ తీరంలోని కెన్నడీ ఎంట్రెన్స్ నుంచి హోమర్‌కు నైరుతి దిశలో 40 మైళ్ళ వరకు ఎఫెక్ట్ ఉండనుంది. భూకంప తీవ్రత 7.6 నుంచి 7.8 మధ్యలో ఉంటే అవి విధ్వసక సునామీలను సృష్టిస్తాయని యుఎస్‌జీఎస్ పేర్కొంది. మరిన్ని భూకంపాలు రావొచ్చని ఆ సంస్థ హెచ్చరించిన కొద్ది సేపటికే..

Recommended Video

Indian Origin In Oxford COVID-19 Vaccine Trial - Ready To Risk Life, Made India Proud || Oneindia
Alaska earthquake: 7.8 magnitude tremor hits, Tsunami warning issued

అదే అలస్కా తీరంలో శాండ్ పాయింట్ తీరం నుంచి 103 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ సముద్రంలో 17.7 కిలోమీటర్ల లోతులో తలెత్తిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. సముద్రం అడుగులో భూకంపం వల్ల తీర పట్టణాల్లో ఎలాంటి ప్రభావం పడలేదని యూఎస్ జీఎస్ తెలిపింది.

English summary
According to the USGS, The 7.8 magnitude earthquake hit about 75 miles south of Chignik in Alaska. Officials have now issued a tsunami warning for South Alaska and the Alaska Peninsula, from Kennedy Entrance to Unimak Pass.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X